Gold and Silver Rates on 2023 December 22 in Hyderabad: దేశవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. ఇటీవల రోజుల్లో తగ్గినట్టే కనిపించిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండు రోజులు పెరిగిన పసిడి ధరలు.. నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (డిసెంబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,000గా ఉంది.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం… ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,900లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,150గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,250లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,550గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,000గా కొనసాగుతోంది.
Also Read: Free Tea For Drivers: లారీ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ఉచితంగా టీ పంపిణీ!
మరోవైపు వెండి ధర కూడా నేడు స్థిరంగానే ఉంది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 79,200లుగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 79,200గా ఉంది. బెంగళూరులో 76,750గా ఉంది. ఇక చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80, 700 వద్ద కొనసాగుతోంది.