Site icon NTV Telugu

Gold Price : పెళ్లిళ్ల సీజన్‌.. పెరిగిన పసిడి ధరలు

Gold And Silver

Gold And Silver

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పసిడి పరుగులు పెడుతోంది. మొన్నటి వరకు పసడి పరుగులకు బ్రేక్‌ పడినా.. ఈ మధ్య పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే.. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 49,600లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,110లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 150పెరుగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.160 పెరిగింది.
Also Read : CM KCR : జగిత్యాల జిల్లాలో రేపు సీఎం కేసీఆర్ పర్యటన.. షెడ్యూల్‌ ఇలా..!

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,260గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,110గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,040 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,650గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,110గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,110గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,110గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,600.. 24 క్యారెట్ల ధర రూ. 54,110గా నమోదైంది.

Also Read : LIVE : అరుణాచల కృత్తికా దీపోత్సవం శుభవేళ ఈ స్తోత్రం వింటే కోటిజన్మల పుణ్యఫలం..
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,110 వద్ద కొనసాగుతోంది. మరోవైపు బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. అలాగే… ముంబైలో కిలో వెండి ధర రూ. 66,500లుగా ఉండగా.. చెన్నైలో రూ. 72,500లుగా ఉంది. బెంగళూరులో రూ. 72,500గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 72,500ల వద్ద కొనసాగుతోంది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి.

Exit mobile version