Gold and Silver Rate Today In Hyderabad: గత ఏడాది చివరలో వరుసగా పెరిగిన బంగారం ధరలు కొనుగోలుదారులను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. అయితే కొత్త ఏడాది ప్రారంభం నుంచి పసిడి ధరలు తగ్గడం లేదా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఓ దశలో ఆల్ టైమ్ రికార్డు ధరలు నెలకొల్పిన బంగారం.. ఈ మధ్య కాలంలో కాస్త దిగిరావడం శుభ పరిణామమనే చెప్పాలి. నేడు పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో నేడు (జనవరి 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,950గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం… ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,850లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,100గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,490గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,950గా కొనసాగుతోంది.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఈరోజు వెండి ధర తగ్గింది. గురువారం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధరపై రూ. 600 తగ్గి.. రూ. 76,000లుగా ఉంది. నేడు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 76,000గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,500 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి ధర అత్యల్పంగా 73,500గా ఉంది.