Site icon NTV Telugu

Today Gold Price: షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే ఎంత పెరిగిందంటే?

Goldrates

Goldrates

Today Gold Price in India and Hyderabad: బంగారం ధరలు తగ్గుతున్నాయని సంబరపడ్డ పసిడి ప్రేమికులకు షాకింగ్ న్యూస్. గత 12 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. ఒక్కరోజులోనే భారీగా పెరిగింది. ఈరోజు 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.600.. 22 క్యారెట్ బంగారం రూ.500 పెరిగింది. గురువారం (ఆగష్టు 21) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,00,750గా.. 22 క్యారెట్ల ధర రూ.92,300గా ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ మార్కెట్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,750గా.. 22 క్యారెట్ల ధర రూ.92,300గా నమోదైంది. విశాఖ, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనాగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1,00,900గా.. 22 క్యారెట్ ధర రూ.92,450గా ట్రేడ్ అవుతోంది. గత 12 రోజుల్లో గోల్డ్ రేట్స్ మూడు వేల పైనే తగ్గగా.. ఈ ఒక్క రోజులో రూ.600 ధర పెరగడం గమనార్హం. మరి రేపటి ధరలు ఎలా ఉంటాయో చూడాలి. పెళ్లిళ్ల సీజన్ కాబట్టి ప్రస్తుతం బంగారంకు ఫుల్ డిమాండ్ ఉంది.

Also Read: Irfan Pathan: అతడు అడిగితే నా ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తా.. ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మరోవైపు వెండి ధర కూడా షాక్ ఇచ్చింది. వరుసగా రెండు రోజులు తగ్గిన వెండి.. నేడు మరలా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 పెరిగి.. రూ.1,16,000గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి లక్ష 26 వేలుగా ఉంది. ఉదయం 10 గంటల వరకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్లో నమోదైన గోల్డ్, సిల్వర్ ధరలు ఇవి. ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే.

Exit mobile version