శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్ల జోరు కనిపిస్తోంది. ఇప్పటికే సంబంధాలు కుదుర్చుకున్న వారు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెళ్లికి ఎంతో కొంత బంగారం కొనడం సాధారణమే. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఊరటనిచ్చాయి. నేడు గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. తులం పసిడి ధర రూ. 110 తగ్గింది. సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,982, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,150 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గింది. దీంతో రూ.91,500 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గింది. దీంతో రూ. 99,820 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. 34 మంది మృతి
విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,650 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,970 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,26,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,16,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
