బంగారం ధరలు తగ్గేదెలా అంటున్నాయి. అంతకంతకు పెరుగుతూ కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. నేడు మరోసారి గోల్డ్ ధరలు భగ్గుమన్నాయి. ఒక్కరోజే తులం బంగారంపై రూ. 440 పెరిగింది. పసిడి తో పాటు వెండి ధరలు కూడా పరుగులు తీస్తున్నాయి. కిలో వెండి ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,933, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,105 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగింది. దీంతో రూ.91,050 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 440 పెరిగింది. దీంతో రూ. 99,330 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read:TamannaahBhatia : పాల లాంటి తెలుపురంగులో మెరుస్తున్న తమ్ము
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,200 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,480 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి. కిలో వెండిపై రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,21,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,11,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
