ఇండియాలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 43,300 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120 తగ్గి రూ. 47, 230 కి చేరింది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 700 తగ్గి రూ. 63,500 వద్ద కొనసాగుతోంది.
మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
