NTV Telugu Site icon

Gold Rates Today: అమ్మబాబోయ్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

Gold

Gold

నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు షాకిచ్చాయి. ఈ రోజు బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. శుభకార్యాల వేళ పసిడి ధరలు పైపైకి ఎగబాకుతుండడంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. పెరుగుతున్న గోల్డ్ ధరలు మగువలకు షాకిస్తున్నాయి. నేడు తులం బంగారంపై రూ. 440 పెరిగింది. ధరలు పెరుగుతుండడంతో బంగారం ఇక అందని ద్రాక్షేనా అని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిల్వర్ ధరలు కూడా నేడు భారీగా పెరిగాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Also Read:IPL 2025: ఐపీఎల్ మ్యాచ్ ల పై ఆసక్తి చూపని క్రికెట్ ఫ్యాన్స్.. ఆన్ లైన్ లో అమ్ముడుపోని టికెట్లు

హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,000, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,250 వద్ద ట్రేడ్ అవుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరగడంతో రూ. 82,500 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 440 పెరగడంతో రూ. 90,000 ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,650గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 90,150 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:Tamannaah : జీవితంలో దేని కోసం మనం ఎదురుచూడకూడదు..

బంగారం బాటలోనే సిల్వర్ పయనిస్తోంది. వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. కిలో వెండిపై ఏకంగా రూ. 1100 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,13,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,04,000 వద్దకు చేరింది. బంగారం, వెండి ధరలు భగ్గుమంటూ హాట్ సమ్మర్ లో మరింత హీట్ పుట్టిస్తున్నాయి.