Site icon NTV Telugu

Gold Rates: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

Goldrates

Goldrates

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం బంగారంపై రూ. 160 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,726, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,915 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గింది. దీంతో రూ.89,150 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 160 తగ్గింది. దీంతో రూ. 97,260 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Also Read:Kanda2 : ‘అఖండ 2’ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్!

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,300 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,410 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు సిల్వర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,17,700 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,07,700 వద్ద ట్రేడ్ అవుతోంది.

Exit mobile version