Site icon NTV Telugu

Gold Rates: ఊరించి.. ఉసూరుమనిపించిన గోల్డ్ ధరలు.. నేడు మళ్లీ పెరిగాయ్

Gold Price

Gold Price

నిన్న భారీగా తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు నేడు ఉసూరుమనిపించాయి. ఇవాళ తులం పసిడి ధర రూ. 270 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,075, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,235 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగింది. దీంతో రూ. 92,350 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగింది. దీంతో రూ. 1,00,750 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

Also Read:Ananya Nagalla : తన బ్రేకప్ స్టోరీ పంచుకున్న అనన్య నాగళ్ల..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగింది. దీంతో రూ. 92,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 270 పెరిగింది. దీంతో రూ. 1,00,900 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు సిల్వర్ ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,20,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,10,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Exit mobile version