Site icon NTV Telugu

Gold Rates: గోల్డ్ ధరలు మళ్లీ తగ్గినయ్.. సిల్వర్ మాత్రం..

Gold Rate Today

Gold Rate Today

గోల్డ్ కొనాలనుకునే వారికి బిగ్ రిలీఫ్. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు మళ్లీ బంగారం ధరలు తగ్గాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 60 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,118, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,275 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 తగ్గింది. దీంతో రూ.92,750 వద్ద అమ్ముడవుతోంది.

Also Read:GST Rate Cuts 2025: ఇక రెండు శ్లాబులు మాత్రమే.. జీఎస్టీ తగ్గింపుపై కేంద్రం కొత్త ప్రణాళిక

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60 తగ్గింది. దీంతో రూ. 1,01,180 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,900 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,330 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,26,200 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,16,200 వద్ద ట్రేడ్ అవుతోంది.

Exit mobile version