Site icon NTV Telugu

Gold Rates: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి ధరలు ఇవే

Gold

Gold

గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గోల్డ్ పై సుంకాలు విధించబోమని ట్రంప్ ప్రకటించిన తర్వాత నేడు మరోసారి పుత్తడి ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 50 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 100 తగ్గింది.హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,135, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,290 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:DRDO Manager Arrested: పాక్ కు గూఢచర్యం.. డీఆర్డీఓ గెస్ట్ హౌస్ మేనేజర్ అరెస్టు

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 తగ్గింది. దీంతో రూ.92,900 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 తగ్గింది. దీంతో రూ. 1,01,350 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,500 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,24,900 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,14,900 వద్ద ట్రేడ్ అవుతోంది.

Exit mobile version