NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్‌.. “పరువు నష్టం దావా” కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తరువులను నిలపివేయాలని కోరుతూ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్‌.. కేసు విచారణ పూర్తయ్యేంత వరకు తనకు విధించిన రెండేళ్ళ జైలు శిక్ష పై కూడా తాత్కాలిక “స్టే” ఉత్తర్వులు జారీ చేయాలని కోరిన రాహుల్.. నేడు విచారణ.

* అమరావతి: నేడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం

* హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు..

* విశాఖ: నేడు ఉత్తరాంధ్ర బీసీ, ఎంబీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం.. హాజరుకానున్న టీడీపీ, ఇతర పార్టీల ముఖ్యనేతలు.

* తిరుమల: ఇవాళ్టి నుంచి శ్రీవారి ఆలయంలో మూడు రోజులు పాటు వార్షిక వసంతోత్సవాలు.. రేపు వసంతోత్సవాలు సందర్భంగా ఉదయం 8 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామివారు.. మూడు రోజులు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

* తిరుమల: ఈ నెల 5,6వ తేదీల్లో తుంభూర తీర్థ ముక్కోటి.. 5న ఉదయం నుంచి 6వ తేదీ మధ్యహ్నం వరకు తుంభూర తీర్థానికి భక్తులును అనుమతించనున్న టీటీడీ

* పల్నాడు: నేడు వైకుంఠపురం, ముత్తాయపాలెం ఇసుక రీచ్ లను సందర్శించనున్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ఇసుక అక్రమ రవాణా ఆరోపణల నేపథ్యంలో ఇసుక రీచ్ లను పరిశీలించనున్న బిజెపి నాయకులు.

* నేటి నుంచి ఈ నెల 18వ వరకు ఏపీ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు.. ఉదయం 9.30 గం నుండి మధ్యాహ్నం 12 .45 గంటల వరకు పరీక్షలు.. ఎగ్జామ్‌ సెంటర్‌ వద్ద 144 సెక్షన్ అమలు.. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల లో సీసీ కెమెరాల ఏర్పాటు

* గుంటూరు: జలదంకి మండలం బ్రాహ్మణ కాక లో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

* నెల్లూరు: రాపూర్ మండలం పెంచలకోన లోని శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నేటి నుంచి వసంతోత్సవాలు

* శ్రీ సత్యసాయి : 59వరోజు నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర.. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనున్న పాదయాత్ర.. ముష్టూరు క్యాంప్ సైట్ నుంచి, సంజీవపురం, యర్రయ్యపల్లి క్రాస్, మన్నిల క్రాస్, కృష్ణంరెడ్డిపల్లి, ఇటుకులపల్లి, ఎస్ కె యూనివర్సిటీ మీదుగా రాప్తాడు పంచాయితీ పనగల్ రోడ్డు సమీపాన విడిది కేంద్రం వరకు సాగనున్న పాదయాత్ర

* శ్రీకాకుళం: నేడు పలాస సత్య సాయి మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం.

* కడప : నాలుగో రోజు కు చేరుకున్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. నేటి ఉదయం కృష్ణాలంకారం, రాత్రికి హనుమంత వాహనంపై దర్శనం ఇవ్వనున్న కోదండ రాముడు..