Today Evening Heavy Rain in Hyderabad.
తెలంగాణను వర్షాలు వీడనంటున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు ఆయకట్టలు తెగడంతో వరద నీరు గ్రామాల్లోకి చేరుతోంది. అయితే తాజాగా నేడు సాయంత్ర మరోసారి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రోడ్లపైకీ వర్షపునీరు వచ్చి చేరింది. అంతేకాకుండా.. కొన్ని చోట్ల చెట్లు తెగిపడటంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మాదాపూర్, షేక్‌పేట, టోలిచౌకి, రాయదుర్గం, గండిపేట, రాజేంద్రనగర్, కిస్మత్‌పర్, బండ్లగూడ జాగీర్ ప్రాంతాలతో పాటు.. అత్తాపూర్, శివరాంపల్లి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
వీటితో పాటు కూకట్‌పల్లి, ఎల్లమ్మబండ, గోల్కొండతో పాటు తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురియడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంనుంచి తప్పించుకునేందుకు ఫ్లైఓవర్లను ఆశ్రయించడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. మరోపక్క జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోడ్లపైకీ వచ్చిన వర్షపు నీటిని తొలగిస్తున్నారు.