NTV Telugu Site icon

CM Chandrababu : నేడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే చంద్రబాబు

Chandrababu

Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన కాలువలలో ఒకటైన బుడమేరు విజయవాడలోని అనేక నివాస ప్రాంతాలను వరదలు ముంచెత్తడం, ముంపునకు గురికావడంతో రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. సింగ్‌ నగర్‌, పాయకాపురం, వైఎస్‌ఆర్‌ కాలనీ తదితర ప్రాంతాలు ముంపునకు గురికావడానికి ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అయితే.. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద నుంచి తేరుకుంటున్నారు బెజవాడ ప్రజలు. అయితే.. 80 శాతం ప్రాంతంలో నీరు తగ్గుముఖం పట్టింది. సహాయ చర్యలు ఊపందుకుంటున్నాయి.

Happy Teachers Day 2024: “ఉపాధ్యాయుల దినోత్సవం” వచ్చేసింది.. మరి మీ గురువులకు “శుభాకాంక్షలు” చెప్పారా.?

అయితే.. ఐదో రోజూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే సీఎం నారా చంద్రబాబు ఉండనున్నారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు. బాధితులకు పరిహారం ఇచ్చేందుకు నష్టంపై అంచనా వేస్తున్నారు సీఎం. ఈఎంఐల రీ షెడ్యూల్ కోసం నిన్న బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబబు. బుడమేరు గండ్లను పూడ్చివేశారు అధికారులు. వాహనాలకు 12 రోజుల్లో బీమా పరిహారం అందజేయనున్నారు. వ్యాపారులు కోలుకోవడానికి ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇళ్లలో నష్టంపై ఆలోచిస్తున్నామని, నేటి నుంచి బియ్యం, పప్పు దినుసులు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు తెలిపారు.

Sukanya Samriddhi Yojana: బిగ్ అప్డేట్.. సుకన్య సమృద్ధి యోజనలో రూల్స్ చేంజ్..

Show comments