NTV Telugu Site icon

Today Business Headlines 17-03-23: ఓలా 2 లక్షల స్కూటర్లు వెనక్కి. మరిన్ని వార్తలు

Today Business Headlines 17 03 23

Today Business Headlines 17 03 23

Today Business Headlines 17-03-23:

టీసీఎస్‌ సీఈఓ రాజీనామా

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ సీఈఓ రాజేశ్‌ గోపీనాథన్‌.. పదవి నుంచి తప్పుకున్నారు. ఈ నిర్ణయం 6 నెలల తర్వాత.. అంటే.. సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో కృతి వాసన్‌ని భవిష్యత్‌ సీఈఓగా నియమించారు. ఈయన ప్రస్తుతం ఇదే సంస్థలో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రెసిడెంట్‌గా, గ్లోబల్‌ హెడ్‌గా ఉన్నారు. రాజేశ్‌ గోపీనాథన్‌ టీసీఎస్‌లో 22 ఏళ్లకు పైగా సర్వీస్‌ చేశారు. గడచిన ఆరేళ్ల నుంచి ఎండీగా, సీఈఓగా సేవలందిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల సీఈఓ పోస్టుకి రాజీనామా చేశారు.

బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌గా శంషాబాద్‌

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కి 2 అవార్డులు వచ్చాయి. స్కైట్రాక్స్‌ అనే సంస్థ వరల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ అవార్డుల్లో భాగంగా వీటిని అందజేయనుంది. ఇండియాతోపాటు సౌతేసియాలో ‘ది బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్ట్‌’ మరియు ‘ది బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌’ అనే రెండు పురస్కారాలను దక్కించుకుంది. అవార్డులు రావటం పట్ల జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ సీఈఓ ప్రదీప్‌ పనిక్కర్‌ హర్షం వ్యక్తం చేశారు. స్కైట్రాక్స్‌ సంస్థ ఇచ్చే అవార్డులకు విమానయాన రంగంలో మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు.

2 లక్షల ఓలా స్కూటర్ల రీకాల్

ఓలా సంస్థ 2 లక్షల ఎలక్ట్రిక్‌ స్కూటర్లను రీకాల్‌ చేసింది. ఫ్రంట్‌ ఫోర్క్‌ ఇష్యూ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్‌1 మరియు ఎస్‌1 ప్రొ మోడల్‌ విద్యుత్‌ స్కూటర్లలో ఈ అప్‌డేట్‌ని ఉచితంగా చేస్తామని తెలిపింది. కొత్త పరికరాన్ని మరింత మన్నికగా, బలంగా డిజైన్‌ చేసినట్లు పేర్కొంది. విద్యుత్‌ వాహనాల తయారీకి సంబంధించి.. మన దేశంలోనే పెద్ద సంస్థగా ఎదిగిన ఓలా ఎలక్ట్రిక్‌.. ఇప్పటివరకు ఇండియాలో 2 లక్షలకు పైగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విక్రయించింది. అయితే.. ఈ వాహనాల్లో ఫ్రంట్‌ ఫోర్క్‌ సస్పెన్షన్‌.. సమస్యగా మారటంతో వాటిని వెనక్కి రప్పిస్తోంది.

శాట్‌లో అర్షద్‌ వార్సి పిటిషన్‌

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి.. సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ అథారిటీని.. అంటే.. శాట్‌ని.. ఆశ్రయించారు. తనతోపాటు తన భార్య సహా 45 సంస్థలపైన సెబీ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. దీంతో.. ఈ పిటిషన్‌పై శాట్‌ ఇవాళ విచారణ జరపనుంది. సాద్న బ్రాడ్‌క్యాస్ట్‌ సంస్థ షేర్ల విలువను ఎక్కువ చేసి చూపించారనే ఆరోపణల నేపథ్యంలో వాళ్లు స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో పాల్గొనకుండా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా.. సెబీ.. నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ఈ నెల 2వ తేదీన వెలువడింది.

ఎస్‌బీఐలో 868 ఉద్యోగాలు

ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా.. 868 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బిజినెస్‌ కరస్పాండెంట్‌ ఫెసిలిటేటర్‌ కొలువుల నియామకానికి ఈ ప్రకటన జారీ చేసింది. ఎస్‌బీఐతోపాటు ఇతర పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో పనిచేసి రిటైరైనవారు ఈ నెల 31వ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబులకు ఫలానా విద్యార్హతలు ఉండాలంటూ ప్రత్యేకంగా ఏమీ పేర్కొనలేదు. సంబంధిత పని అనుభవం మరియు యోగ్యత ఉంటే చాలని తెలిపింది. అర్హులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియమించుకుంటామని స్పష్టం చేసింది.

ఇండియాలో భారీగా ఆస్తులు

స్విట్జర్లాండ్‌లోని 2వ అతిపెద్ద కమర్షియల్‌ బ్యాంక్‌ అయిన క్రెడిట్‌ సూయిజ్‌కి ఇండియాలో 20 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయి. భారతదేశంలోని టాప్‌-15 ఫారన్‌ బ్యాంకుల్లో 14వ ర్యాంక్‌ సంపాదించిన ఈ సంస్థకు 70 శాతం ఆస్తులు గవర్నమెంట్‌ సెక్యూరిటీల రూపంలోనే ఉండటం విశేషం. క్రెడిట్‌ సూయిజ్‌ మొత్తం ఆస్తులతో పోల్చితే.. ఆ కంపెనీ ఆఫ్‌-బ్యాలెన్స్‌ షీట్‌ ఐటమ్స్‌ 7 రెట్లు ఎక్కువే కావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ విషయాలను ఫైనాన్షియల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ జెఫరీస్‌ వెల్లడించింది.

Show comments