Site icon NTV Telugu

Today Business Headlines 12-04-23: అప్పుల కోసం.. ఆస్తుల అమ్మకం. మరిన్ని వార్తలు

Today Business Headlines 12 04 23

Today Business Headlines 12 04 23

Today Business Headlines 12-04-23:

దేశంలో మరో కొత్త సూచీ

దేశీయ మార్కెట్‌లో మరో సూచీ అందుబాటులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ ఇండెక్స్‌ నిన్న మంగళవారం ప్రారంభమంది. రీట్స్ అండ్ ఇన్విట్స్‌గా పేర్కొనే ఈ ఇండెక్స్‌ను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండిసెస్ లిమిటెడ్ ఆవిష్కరించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదై ట్రేడ్ అవుతున్న రీట్స్ మరియు ఇన్విట్స్ పనితీరును ఈ సూచీ తెలియజేస్తుంది. ఈక్విటీలు, డెట్, గోల్డ్ వంటి వాటిపై పెట్టుబడి పెట్టేవాళ్లు ఈ రీట్స్ అండ్ ఇన్విట్స్‌లో ఇన్వెస్ట్ చేయటం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

వేరే సంస్థలోకి ట్విట్టర్

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను ఎక్స్ అనే ఎవ్రీథింగ్ యాప్‌లో విలీనం చేశారు. దీంతో.. ట్విట్టర్ అనే ఇండిపెండెంట్ కంపెనీ మనుగడలో లేదని సంస్థ స్పష్టం చేసింది. ఓ కేసుకు సంబంభించి.. న్యాయస్థానానికి ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ నిన్న మంగళవారం ‘ఎక్స్’ అనే ఒకే ఒక అక్షరాన్ని ట్వీట్ చేశారు. ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ తుది దశలో ఉండగా మస్క్ నుంచి ఇలాంటి ప్రకటన రావటం అనూహ్యం.

ఎస్‌పీ ఆస్తుల అమ్మకం

అప్పులు మరియు వాటికి కట్టాల్సిన వడ్డీల కోసం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఆస్తుల అమ్మకాలు చేపట్టింది. ముంబైలోని అఫ్కాన్ కంపెనీలో తన వాటాను కొనుగోలు చేసేవారి కోసం సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షేరును అమ్మటం ద్వారా 16 వేల 400 కోట్లు సమీకరించనుంది. ఈస్ట్ కోస్ట్‌లోని గోపాల్‌పూర్ నౌకాశ్రయాన్ని విక్రయించాలని కూడా చూస్తోంది. ఈ విషయాలను ఒక ఇంగ్లిష్ మీడియా పేర్కొంది. టాటా సన్స్‌లో ఉన్న వాటాను సైతం తనఖా పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు మరో మీడియా సంస్థ గత వారం తెలిపింది.

ఐఏఆర్‌బీఏ సదస్సు

హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకి వేదిక కాబోతోంది. ఈ సదస్సును ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ నిర్వహిస్తోంది. ఈ నెల 21 నుంచి 23 వరకు జరగనున్న జరగనున్న ఈ సమావేశానికి దాదాపు 400 మంది ప్రతినిధులు హాజరుకాన్నారని అంచనా వేస్తున్నారు. రైస్ బ్రాన్ ఆయిల్‌పై ప్రచారం.. వ్యాల్యూ యాడెడ్ ప్రొడక్టులు మరియు ఈ రంగంలో వస్తున్న కొత్త సాంకేతికతలపై సదస్సులో చర్చించనున్నట్లు ప్రతినిధులు వివరించారు.

ఉప్పల్ స్టేడియం రెనోవేషన్

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ క్రికెట్ స్టేడియాన్ని ఆధునికీకరించేందుకు బీసీసీఐ 117 కోట్ల రూపాయలను మంజూరు చేయనుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ఈ స్టేడియాన్ని కూడా ఒక వేదికగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా బాక్సులు, వాష్ రూమ్‌ ఫెసిలిటీస్, చెయిర్‌లు, లైట్లు, వైఫై సిస్టమ్‌లను రెనోవేషన్ చేయనున్నారు. దీంతోపాటు స్టేడియం యాప్‌లను కూడా రూపొందిస్తారు.

మాతో కలిసి పనిచేయండి

అంతరిక్ష సాంకేతిక రంగంలో తమతో కలిసి పనిచేయాలని డీఆర్‌డీఓ చీఫ్ సమీర్ వీ కామత్.. ప్రైవేట్ రంగానికి పిలుపునిచ్చారు. స్టార్టప్‌లు, విద్యా సంస్థలు, ఎంఎస్ఎంఈలు మరియు ఇండస్ట్రీతో కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నట్లు చెప్పారు. మన దేశం మరిన్ని సామర్థ్యాలను శరవేగంగా సాధించాలంటే ఇది అవసరమని పేర్కొన్నారు. ఐఐటీలు, ఐఐఎస్సీల్లో డీఆర్‌డీఓ 15 అకాడమీ ఎక్స్‌లెన్స్ సెంసెంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు. సమీర్ వీ కామత్ పిలుపునకు ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ స్పందించారు.

Exit mobile version