Site icon NTV Telugu

Today Business Headlines 05-05-23: చైనాకి.. మంత్రి కేటీఆర్. మరిన్ని వార్తలు

Today Business Headlines 05 05 23

Today Business Headlines 05 05 23

Today Business Headlines 05-05-23:

చైనాకి.. మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. వచ్చే నెలలో చైనా వెళ్లనున్నారు. జూన్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆ దేశంలోని టియాంజిన్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందింది. తెలంగాణలో వ్యవస్థాపకత, ఆవిష్కరణ, డిజిటల్ పరివర్తన’ అనే అంశంపై కేటీఆర్ తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సదస్సులో 15 వందల మంది ప్రతినిధులు పాల్గొంటారని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గే బ్రెండే తెలిపారు.

అమెరికా గడ్డపై మన..

163 ఇండియన్ కంపెనీలు అమెరికాలో 3 పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాయి. 4 కోట్ల పాతిక లక్షల మందికి జాబులిచ్చాయి. దీనివల్ల టెక్సాస్, న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, జార్జియా, ఓహియో, మంతానా, ఇల్లినాయిస్ వంటి రాష్ట్రాలు లబ్ధిపొందాయి. ఈ విషయాలను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. అమెరికా గడ్డపై భారత మూలాలు అనే పేరుతో నివేదికను విడుదల చేసింది. మన సంస్థలు యూఎస్‌లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 18 పాయింట్ 5 కోట్ల డాలర్లు ఖర్చు చేశాయని పేర్కొంది.

క్యాప్ జెమినీకి కేరాఫ్

క్యాప్ జెమినీ సంస్థకు ఇన్నోవేషన్ కేంద్రంగా హైదరాబాద్‌ నిలిచింది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 22 ఆవిష్కరణల కేంద్రాలు ఉండగా ఇండియాలో రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి. ఒకటి ముంబై కాగా రెండోది హైదరాబాద్. క్యాప్ జెమినీకి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అప్లైడ్ ఇన్నోవేషన్ ఎక్స్ఛేంజ్ సెంటర్.. ఫైనాన్షియల్ సర్వీసులు, లైఫ్ సైన్సెస్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, కన్జ్యూమర్ గూడ్స్ రంగాల్లోని కంపెనీలకు సరికొత్త ప్లాట్‌ఫామ్‌లను మరియు సొల్యూషన్లను డెవలప్ చేస్తోందని సీనియర్ డైరెక్టర్ రంజన్ ప్రధాన్ చెప్పారు.

అమరరాజాకి శ్రీకారం

అమరరాజా బ్యాటరీస్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఏర్పాటుచేస్తున్న గిగా కారిడార్ ప్రాంగణానికి రేపు శంకుస్థాపన జరగనుంది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అమరరాజా గ్రూపు ఫౌండర్ రామచంద్ర, సీఎండీ జయదేవ్ తదితరులు పాల్గొంటారు. ఈ కారిడార్.. లిథియం సెల్ బ్యాటరీ ప్యాక్ తయారీకి అతిపెద్ద కర్మాగారంగా నిలవనుంది. ఈ యూనిట్ నిర్మాణాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేసి ఉత్పత్తి చేపట్టనున్నారు.

…అకాల వర్షాల దెబ్బ

కన్జ్యూమర్ డ్యూరబుల్ ప్రొడక్టులను విక్రయించే సంస్థల అమ్మకాలపై అకాల వర్షాల దెబ్బ పడింది. సమ్మర్ ప్రొడక్ట్‌లైన ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, బేవరేజెస్, ఐస్‌క్రీమ్స్ సేల్స్ పడిపోయాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 26 శాతం తగ్గాయి. వర్షాలు కురవటంతో వాతావరణం చల్లగా మారటం వల్ల ఈ ఉత్పత్తులను కొనేవారి సంఖ్య తగ్గిపోయింది. ఫలితంగా ఆయా కంపెనీలు సమ్మర్ టార్గెట్లను రీచ్ కాలేకపోయాయి. వాస్తవానికి.. ఏడాది మొత్తమ్మీద జరిగే ఈ కేటగిరీ సేల్స్‌లో యాభై శాతానికి పైగా సేల్స్ ఎండాకాలంలోనే జరుగుతుంటాయి.

నెస్లేకి వాటర్ ప్రాబ్లం

గ్లోబల్ ఫుడ్ అండ్ బేవరేజ్ జెయింట్ కంపెనీ నెస్లేకి ఫ్రాన్స్‌లో మినరల్ వాటర్ సమస్యలు తలెత్తాయి. కరువు మరియు అనుకోని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తూర్పు ఫ్రాన్స్‌లోని రెండు నీళ్ల బావుల నుంచి నీటి సేకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ అనుబంధ సంస్థ అయిన నెస్లే వాటర్స్‌కి విట్టెల్ మరియు పెర్రియెర్ అనే రెండు బ్రాండ్లు ఉన్నాయి. వీటి తయారీకి కావాల్సిన మినరల్ వాటర్‌ని మిగతా నాలుగు బావుల నుంచి సేకరించటాన్ని కొనసాగించనుంది.

Exit mobile version