Today (30-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇవాళ ఈ ఏడాది చిట్టచివరి ట్రేడింగ్ సెషన్ జరిగింది. రేపు శనివారం స్టాక్ మార్కెట్‌కి సెలవు కావటంతో ఈ రోజు శుక్రవారమే 2022కి లాస్ట్ ట్రేడిండ్ డే అయింది. ఇవాళ రెండు సూచీలు కూడా ఫ్లాట్‌గా కొనసాగాయి. కొద్దిసేపు లాభాల్లోకి.. మరికొద్దిసేపు నష్టాల్లోకి జారుకుంటూ ఊగిసలాట ప్రదర్శించాయి.
ఉదయం లాభాలతోనే ప్రారంభమైనప్పటికీ చివరికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఈ రోజు 293 పాయింట్లు కోల్పోయి 60 వేల 840 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 109 పాయింట్లు తగ్గి 18 వేల 81 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఈ ఏడాది మొత్తమ్మీద 4 పాయింట్ 4 శాతం లాభాలను నమోదు చేయగా నిఫ్టీ 4 పాయింట్ 3 శాతం పెరిగింది.
read also: Reliance-Metro Deal: ఒకేసారి పెరగనున్న 30 లక్షల మంది కస్టమర్లు
సెన్సెక్స్.. ఇంట్రాడేలో అత్యధికంగా 61 వేల 392 పాయింట్ల వరకు పెరిగింది. తర్వాత.. 61 వేల 150 పాయింట్లకు తగ్గింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సున్నా పాయింట్ ఏడు శాతం లాభపడగా.. స్మాల్‌క్యాప్ ఒక శాతానికి పైగా పెరిగింది. బజాజ్ ఫిన్‌సర్వ్ షేరు రెండు శాతానికి పైగా ర్యాలీ తీసింది. టైటాన్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ ఒక శాతం చొప్పున లాభపడ్డాయి.
సెన్సెక్స్‌లో గ్రాసిమ్, మెట్రో బ్రాండ్స్, క్రిసిల్ సంస్థల షేర్లు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. బజాజ్ ట్విన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ కూడా బాగా వెనకబడ్డాయి. నిఫ్టీ50 ఇవాళ ఒకానొక దశలో దాదాపు 18 వేల 200 పాయింట్ల స్థాయికి ఎదిగింది. బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ, కోలిండియా విశేషంగా రాణించాయి. ఎస్‌బీఐ లైఫ్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ స్టాక్స్ దెబ్బతిన్నాయి.
అన్ని రంగాల స్టాక్స్ కూడా సానుకూలంగానే ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల సూచీ, మెటల్ అండ్ ఐటీ ఇండెక్స్‌లు ఒక శాతం దాక ప్రాఫిట్స్ నమోదు చేశాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. హెచ్‌జీ ఇన్‌ఫ్రా షేర్ల విలువ 8 శాతానికి పైగా గ్రోత్ అయ్యాయి. క్రాఫ్ట్స్‌మ్యాన్ ఆటోమేషన్ సంస్థ స్టాక్స్ 9 శాతానికి మించి రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించాయి.
10 గ్రాముల బంగారం ధర 41 రూపాయలు తగ్గి గరిష్టంగా 54 వేల 930 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 481 రూపాయలు మైనస్ అయి 69 వేల 286 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ రెండు పైసలు కోల్పోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 81 పైసల వద్ద స్థిరపడింది.
