NTV Telugu Site icon

Today (30-01-23) Stock Market Roundup: బడ్జెట్ ముందు భయాలు

Today (30 01 23) Stock Market Roundup

Today (30 01 23) Stock Market Roundup

Today (30-01-23) Stock Market Roundup: రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదారుల్లో భయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో వాటాల అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఫలితంగా ఈ వారం ప్రారంభం రోజైన ఇవాళ సోమవారం రెండు కీలక సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. బెంచ్‌ మార్క్‌ను దాటి పైకి రాలేకపోయాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ వెంటనే లాభాల్లోకి వచ్చాయి.

Budget and Startups: కేంద్ర బడ్జెట్‌.. స్టార్టప్‌లకు ఏమిస్తుంది?

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఏకంగా 950 పాయింట్లు పెరిగింది. తర్వాత మళ్లీ నెగెటివ్‌ జోన్‌లోకి పడిపోయి 300 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 17 వేల 500 పాయింట్ల వద్ద టెస్టింగ్‌ ఎదుర్కొంది. చివరికి.. సెన్సెక్స్‌.. 169 పాయింట్లు పెరిగి 59 వేల 500 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది. నిఫ్టీ స్వల్పంగా 44 పాయింట్లు లాభపడి 17 వేల 648 పాయింట్ల వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సున్నా పాయింట్‌ 5 శాతం వరకు తగ్గాయి. సెక్టార్ల వారీగా చూస్తే.. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ బాగా రాణించింది. ఒక శాతం వరకు పెరిగి లాభ పడ్డ రంగాల్లో టాప్‌లో నిలిచింది. నిఫ్టీ ఆయిల్‌ మరియు గ్యా్‌స్‌ సూచీలు నాలుగు శాతం డౌన్‌ అయ్యాయి. వ్యక్తిగత స్టాక్స్‌ విషయానికొస్తే.. సెన్సెక్స్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు మంచి పనితీరు కనబరిచాయి.

డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఈ సంస్థ స్టాక్స్‌ వ్యాల్యూ 5 శాతం వరకు పెరిగింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలో 10 శాతం అప్పర్‌ కట్‌ స్థాయి నుంచి దిగొచ్చాయి. ఉదయం కేవలం 2 శాతమే పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర నామమాత్రం 43 రూపాయలు పెరిగింది.

అత్యధికంగా 56 వేల 900 రూపాయలు పలికింది. కేజీ వెండి రేటు 280 రూపాయలు లాభపడి గరిష్టంగా 68 వేల 609 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. క్రూడాయిల్‌ ధర పాతిక రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్‌ ముడి చమురు 6 వేల 481 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 5 పైసలు తగ్గింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 52 పైసల వద్ద స్థిరపడింది.