Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Today 29 12 22 Stock Market Roundup Profits In Todays Second Half Trading

Today (29-12-22) Stock Market Roundup: సెకండాఫ్‌ బాగుంది

Published Date :December 29, 2022 , 4:18 pm
By Akkirala Kondala Rao
Today (29-12-22) Stock Market Roundup: సెకండాఫ్‌ బాగుంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Today (29-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఎట్టకేలకు ఇవాళ కోలుకుంది. నిన్న బుధవారం నష్టాల్లో ముగిసిన రెండు సూచీలు ఇవాళ శుక్రవారం ఉదయం కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. కానీ మధ్యాహ్నం తర్వాత లాభాల బాటలోకి వచ్చి చివరికి లాభాల్లోనే ముగిశాయి. ఎర్లీ ట్రేడింగ్‌లో గ్లోబల్‌ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో వరుసగా రెండో రోజు కూడా బిజినెస్‌ లాస్‌లోనే నడుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

కానీ సెకండాఫ్‌లో సెలెక్టెడ్‌ బ్యాంకులు, మెటల్‌ షేర్లు పుంజుకొని లాభాలు ఆర్జించటంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెన్సెక్స్‌ 223 పాయింట్లు పెరిగి 61 వేల 133 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది. నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 18 వేల 210 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 స్టాక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ 2 శాతానికి పైగా ర్యాలీ తీశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా సంస్థల షేర్లు కూడా బాగానే రాణించాయి.

read also: Gold Shine in 2023: వచ్చే ఏడాది.. మాంద్యం వచ్చినా.. రాబడి తగ్గినా.. నో ఎఫెక్ట్‌..

మరో వైపు.. టాటా మోటార్స్‌, టైటాన్‌ స్టాక్స్‌ విలువ ఒక శాతం కన్నా ఎక్కువే పడిపోయింది. నిఫ్టీలో ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, ఐషర్‌ మోటర్స్‌ 2 శాతానికి పైగా లాభపడి టాప్‌ లెవల్‌లో నిలిచాయి. సరెగమ ఇండియా, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, శ్రీసిమెంట్‌, కల్యాణ్‌ జ్యూలర్స్‌ నష్టాలు చవిచూశాయి. రంగాల వారీగా చూస్తే మెటల్‌ అండ్‌ ఎనర్జీ ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా పెరిగాయి. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ మరియు క్యాపిటల్‌ గూడ్స్‌ సూచీలు సుమారు అర శాతం తగ్గాయి. ఫార్మా రంగం సైతం నష్టపోయింది.

10 గ్రాముల బంగారం ధర నామమాత్రంగా 16 రూపాయలు పెరిగి గరిష్టంగా 54 వేల 777 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. కేజీ వెండి రేటు అతి స్వల్పంగా 16 రూపాయలు ప్లస్‌ అయి 69 వేల 30 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 7 పైసలు తగ్గింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 79 పైసలుగా నమోదైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • domestic stock market business
  • indian stock market
  • stock market highlights
  • stock market roundup
  • today stock market u[dates

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions