NTV Telugu Site icon

Today (27-12-22) Business Headlines: సామాన్యుడి బండి.. సరికొత్తగా. మరిన్ని ముఖ్య వార్తలు

Today (27 12 22) Business Headlines

Today (27 12 22) Business Headlines

Today (27-12-22) Business Headlines:

‘‘పవర్‌ మెక్‌’’కి ఖాజీపేట: హైదరాబాద్‌కు చెందిన పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ అనే సంస్థ కొత్తగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువైన లోకల్‌, నేషనల్‌, ఇంటర్నేషనల్‌ ఆర్డర్లను దక్కించుకుంది. లోకల్‌ కేటగిరీలో తెలంగాణలోని ఖాజీపేటలో 306 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో వ్యాగన్‌ రిపేర్‌ వర్క్‌షాపు నిర్మించనుంది. నేషనల్‌ లెవల్‌లో అదానీ గ్రూపు నుంచి 608 కోట్ల రూపాయల ఆర్డర్‌ పొందింది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌ మరియు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని ఆ సంస్థ పవర్‌ ప్లాంట్లకు మెషినరీని సప్లై చేస్తుంది. ఇంటర్నేషనల్‌ సెగ్మెంట్‌లో నైజీరియాలోని ఒక పెట్రో కెమికల్‌ ప్రాజెక్టుకు మెయింటనెన్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ సర్వీసులను అందించనుంది.

‘మార్కెట్‌’ వ్యాల్యూ జంప్‌

గత వారంలో 4 రోజుల్లోనే 16 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసిన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లోని లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ నిన్న ఒక్క రోజే మూడో వంతు తిరిగి రావటం విశేషం. సోమవారం 5 పాయింట్‌ ఏడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెరగటంతో మొత్తం వ్యాల్యూ 277 పాయింట్‌ ఎనిమిది ఆరు లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇన్వెస్టర్లు.. ఫైనాన్షియల్‌.. ఐటీ అండ్‌ ఆయిల్‌ షేర్లను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయటం వల్ల సెన్సెక్స్‌లో లాభాల సందడి నెలకొంది. మరో వైపు.. నిఫ్టీలోని మొత్తం 50 స్టాక్స్‌లో కేవలం 10 షేర్లే నష్టాల్లో క్లోజ్‌ అవటం చెప్పుకోదగ్గ విషయం.

ప్రపంచ స్థాయిలో హెటెరో

హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా సంస్థ హెటెరో డ్రగ్స్‌ రూపొందించిన కరోనా మందు ప్రపంచ స్థాయిలో మెరిసింది. నిర్మాకామ్‌గా పేర్కొనే ఈ మెడిసిన్‌కి.. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌.. ప్రీక్వాలిఫికేషన్‌ గుర్తింపునిచ్చింది. ఈ ఔషధం ప్యాక్‌ ధరను ఇండియన్‌ మార్కెట్‌లో 4 వేల 900 రూపాయలుగా నిర్ణయించారు. నిర్మాకామ్‌ అనేది ఫైజర్‌ సంస్థ ఉత్పత్తి చేసిన పాక్స్‌లోవిడ్‌కి జనరిక్‌ రూపం కావటం గమనించాల్సిన అంశం. పాక్స్‌లోవిడ్‌లో మాదిరిగానే నిర్మాకామ్‌లోనూ నిర్మాట్రెల్‌విర్‌ మరియు రిటొనవిర్‌ అనే 2 ట్యాబ్లెట్లు ఉంటాయి. WHO రికగ్నిషన్ పొందటంతో ఈ మందును 95 అల్ప మరియు మధ్య ఆదాయ దేశాల్లో తక్కువ రేటుకు అమ్మొచ్చు.

సామాన్యుడి బండి.. సరికొత్తగా..

తొలిసారిగా అర్ధ శతాబ్దం కిందట తెర మీదికొచ్చి.. ఒకానొక దశలో రోజుకు 2 వేల యూనిట్ల వరకు సేలైన మధ్య తరగతి ప్రజల ద్విచక్ర వాహనం లూనా. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ లూనా రూపంలో మరోసారి ఆమ్‌ ఆద్మీని ఆకట్టుకునేందుకు తుది మెరుగులు దిద్దుకుంటోంది. సగటు జీవికి సరిగ్గా సరిపోయే లూనాకు కైనెటిక్‌ గ్రూప్‌ త్వరలోనే కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించనుంది. 50 ఏళ్ల క్రితం 2 వేల రూపాయలకు అందుబాటులోకి వచ్చి విశేష ఆదరణ పొందిన ఈ మోపెడ్‌ ఇప్పుడు ఎంత రేటుకు లభిస్తుందో, గతంలో మాదిరిగానే అలరిస్తుందో లేదో చూడాలి. ఈ వాహనం ఉత్పత్తిని ప్రస్తుతం నెలకు 5 వేల యూనిట్లతో ప్రారంభించారు.

చెల్లింపు మోసాలకు చెక్‌

నగదు చెల్లింపుల్లో జరిగే మోసాలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెక్‌ పెట్టబోతోంది. క్యాష్‌ పేమెంట్ ఫ్రాడ్స్‌కు సంబంధించిన ఫిర్యాదులను 2023 జనవరి ఒకటో తేదీ నుంచి ‘దక్ష్’ అనే ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్‌ చేయాలని ఆర్బీఐ కోరింది. బ్యాంకులు మరియు పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించింది. బాధితులు ఇప్పటివరకు ఇలాంటి కంప్లైంట్స్‌ని ఎలక్ట్రానిక్‌ డేటా సబ్మిట్‌ పోర్టల్‌లో నమోదు చేసేవాళ్లు. దీని స్థానంలో ఎక్‌స్ట్రా ఫీచర్లతో ‘దక్ష్’ వేదికను అందుబాటులోకి తెచ్చారు.

చేతులు మారిన ‘సువెన్‌’

హైదరాబాద్‌ సంస్థ సువెన్‌ ఫార్మాపై ఇటీవల వచ్చిన వార్తలు నిజమయ్యాయి. మెజారిటీ వాటా విక్రయానికి అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థతో చర్చలు జరుగుతున్నట్లు లేటెస్ట్‌గా న్యూస్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లే 50 పాయింట్‌ 1 శాతం షేరును ఈ గ్లోబల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీకి అమ్ముతున్నట్లు సువెన్‌ ఫార్మా వెల్లడించింది. సంస్థ ప్రమోటర్‌ వెంకట్‌ జాస్తి ఈ వాటాను 6 వేల 313 కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నారు. రూపాయి ఫేస్‌ వ్యాల్యూ గల ఒక్కో షేరును 495 రూపాయలకు సేల్‌ చేస్తున్నారు. దీంతో ఆయన వాటా ఇక 9 శాతానికే పరిమితమవుతుంది. సువెన్‌ ఫార్మాను కొహాన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌లో విలీనం చేసే ఛాన్స్‌ సైతం ఉంది.