Today (21-02-23) Stock Market Roundup: ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లో ఇవాళ మంగవాళం ఎక్కువ శాతం ట్రేడిండ్ ఊగిసలాట ధోరణిలో నడిచింది. రెండు కీలక సూచీలు లాభనష్టాల మధ్య దోబూచులాడాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్.. సాయంత్రం స్వల్ప నష్టాలతో ముగిసింది. నిఫ్టీ 18 వేల బెంచ్ మార్క్‌కి దిగువన క్లోజ్ అయింది. ఇంట్రాడేలో టాటా స్టీల్ మరియు రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపటంతో సెన్సెక్స్, నిఫ్టీ కాస్త కోలుకున్నాయి.
చివరికి.. సెన్సెక్స్.. 18 పాయింట్లు కోల్పోయి 60 వేల 672 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. నిఫ్టీ.. 17 పాయింట్లు తగ్గి 17 వేల 826 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో శిల్పా మెడికేర్, జెన్‌సర్, అదానీ పవర్ తదితర సంస్థల షేర్లు బాగా రాణించాయి. BoI, టీటీఎంఎల్, అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ తీవ్రంగా నష్టపోయాయి.
read more: India found deposit of lithium: బ్యాటరీలు, ఈవీ మార్కెట్‌లో ఇక మనదే హవా
రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌లు సున్నా పాయింట్ 7 శాతం వరకు పెరిగాయి. మరో వైపు.. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఐటీ సూచీలు నేలచూపులు చూశాయి. వ్యక్తిగత షేర్లను పరిశీలిస్తే.. డెలివరీ సంస్థ స్టాక్స్ విలువ గత ఏడు ట్రేడింగ్ సెషన్లలోనూ పెరుగుతూ వస్తోంది. క్యూ3 ఫలితాలు కలిసొచ్చాయి.
ఇదిలాఉండగా.. యుఫ్లెక్స్ ఇండియా షేర్ల విలువ 4 పాయింట్ 4 శాతం తగ్గింది. తద్వారా 52 వారాల కనిష్టానికి.. అంటే.. 466 రూపాయలకి పతనమైంది. జెన్ టెక్నాలజీస్ సంస్థ.. రికార్డు స్థాయి పనితీరు కనబరిచింది. ఈ కంపెనీ షేర్లు ఒక్క నెలలోనే 35 శాతం పెరిగాయి. క్యూ3 ఫలితాలు ఆశాజనకంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. 10 గ్రాముల బంగారం ధర 86 రూపాయలు తగ్గింది.
గరిష్టంగా 56 వేల 127 రూపాయలు పలికింది. కేజీ వెండి రేటు 150 రూపాయలు నష్టపోయింది. అత్యధికంగా 65 వేల 599 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. క్రూడాయిల్ ధర 56 రూపాయలు కోల్పోయింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 374 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 7 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 81 పైసల వద్ద స్థిరపడింది.
