Today (10-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతాన్ని నష్టాలతో ప్రారంభించి నష్టాలతోనే ముగించింది. ఇవాళ శుక్రవారం ఈక్విటీ మార్కెట్లు ఎక్కువ శాతం నేల చూపులు చూశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ.. 50 పాయింట్లకు పైగా పడిపోగా.. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా కోల్పోయింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్ తదితర సంస్థల షేర్ల అమ్మకాలు పెరగటంతో కీలకమైన సూచీలు కోలుకోలేకపోయాయి.
చివరికి.. సెన్సెక్స్.. 123 పాయింట్లు కోల్పోయి 60 వేల 682 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్వల్పంగా 36 పాయింట్లు తగ్గి 17 వేల 856 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. Broader Markets బాగానే రాణించాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్, మిడ్ క్యాప్ హండ్రెడ్ సున్నా పాయింట్ 6 శాతం వరకు పెరిగాయి.
read more: Special Story on Amazon’s Logistics Business: ట్రక్కులు, ఓడలు, విమానాల్లో డెలివరీ
సెన్సెక్స్‌లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, అరబిందో ఫార్మా, ఎస్కార్ట్స్ మంచి పనితీరు కనబరిచాయి. సెన్సెక్స్‌లో పేటీఎం, అదానీ గ్రూప్, ఫైనా ఆర్గానిక్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ మరియు నిఫ్టీ.. రెండింటిలోనూ హెచ్‌సీఎల్ టెక్ బాగా నష్టపోయిన సంస్థల్లో టాప్‌లో నిలిచింది. సెక్టార్ల వారీగా చూసుకుంటే.. నిఫ్టీ మీడియా, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇండెక్స్‌లు రెండు శాతం వరకు లాభపడ్డాయి.
ఐటీ మరియు మెటల్ సూచీలు ఒక శాతం దాక డౌన్ అయ్యాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఇంకా ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్, టోటల్ గ్యాస్ స్టాక్స్ ఏకంగా 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర 126 రూపాయలు పడిపోయింది.
అత్యధికంగా 56 వేల 726 రూపాయలు పలికింది. కేజీ వెండి రేటు 182 పాయింట్లు తగ్గింది. దీంతో గరిష్టంగా 66 వేల 848 రూపాయలుగా నమోదైంది. క్రూడాయిల్ ధర 185 రూపాయలు పెరిగింది. ఫలితంగా ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 607 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. రూపాయి వ్యాల్యూ 3 పైసలు తగ్గింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 57 పైసల వద్ద స్థిరపడింది.
