Today (08-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో 2 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ బుధవారం 2 కీలక సూచీలు లాభాల్లో ప్రారంభమై లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.25 శాతం పెంచినప్పటికీ ఆ ప్రభావం ఈక్విటీ మార్కెట్‌పై ఏమాత్రం పడలేదు. ఐటీ, మెటల్, అదానీ గ్రూప్ స్టాక్స్ బెంచ్ మార్క్‌లకు మద్దతుగా నిలిచాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఇంట్రాడేలో గరిష్ట విలువలకు చేరాయి.
సెన్సెక్స్ చివరికి 377 పాయింట్లు పెరిగి 60,663 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 17,871 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 24 సంస్థలు లాభాల బాటలో నడిచాయి. ఆరు కంపెనీలు మాత్రమే నష్టాల బారినపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఒక శాతం మెరుగుపడింది. స్మాల్ క్యాప్ 0.76 శాతం లాభపడింది.
read more: The India Box Office Report-October: వెండి తెరను మురిపించి.. మెరిపించిన సం‘చలన’ చిత్రం..
నిఫ్టీలో అందానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ధర ఏకంగా 23 శాతం పెరిగింది. అదానీ పోర్ట్స్ స్టాక్స్ 9 శాతం వరకు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హిండాల్కో, రిల్ తదితర సంస్థలు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించాయి. సెక్టార్ల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4 శాతం జంప్ అయింది. ఐటీ సూచీ ఒకటిన్నర శాతం, ఫార్మా ఇండెక్స్ 1.43 శాతం పెరిగాయి.
10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 33 రూపాయలు పెరిగి అత్యధికంగా 57,290 రూపాయలు పలికింది. కేజీ వెండి రేటు 221 రూపాయలు లాభపడి గరిష్టంగా 67,750 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 98 రూపాయలు పెరిగి ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 461 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 22 పైసలు పెరిగింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 54 పైసల వద్ద స్థిరపడింది.
