NTV Telugu Site icon

Today (04-01-23) Stock Market Roundup: ‘అమెరికా’ ప్రభావం.. అమాంతం నష్టం..

Today (04 01 23) Stock Market Roundup

Today (04 01 23) Stock Market Roundup

Today (04-01-23) Stock Market Roundup: కొత్త సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ తొలిసారి నష్టాలతో ముగిసింది. ఈ రోజు బుధవారం ఉదయం రెండు సూచీలు కూడా అతి స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ప్రారంభమై భారీ లాసులతో క్లోజ్ అయ్యాయి. ఇంట్రాడేలో టుడే లోయెస్ట్‌ వ్యాల్యూస్‌కి పడిపోయాయి. సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా పతనం కాగా నిఫ్టీ 150 పాయింట్లకు పైగా తగ్గింది. ఫలితంగా సెన్సెక్స్‌ 60 వేల 633 పాయింట్లకు, నిఫ్టీ 18 వేల 037 పాయింట్లకు దిగొచ్చాయి.

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వ్‌ లేటెస్ట్‌ పాలసీ మీటింగ్‌ నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ భేటీ నిర్ణయాల కోసం ఇన్వెస్టర్లు వెయిటింగ్‌ చేయటంతో డీల్స్‌ అన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఫలితంగా ఇండెక్స్‌లకు ప్రాఫిట్స్‌ కరువయ్యాయి. సెన్సెక్స్‌ 636 పాయింట్లు కోల్పోయి మరోసారి 61 వేల పాయింట్ల మార్క్‌ కన్నా దిగువకు పడిపోయింది. చివరికి 60 వేల 657 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 189 పాయింట్లు నష్టపోయి 18 వేల 42 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది.

read more: Upcoming Electric Cars in 2023: ఈ సంవత్సరం మార్కెట్‌లోకి వస్తున్న ఎలక్ట్రిక్‌ కార్లు

సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో రెండు కంపెనీలు మాత్రమే స్వల్ప లాభాలను ఆర్జించాయి. ప్రిజమ్‌ జాన్సన్‌, ఆర్‌సీఎఫ్‌ స్టాక్స్‌ ఇవాళ్టి కనిష్ట విలువ నుంచి 9 శాతం వరకు పెరిగాయి. పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, గ్లెన్‌మార్క్‌, రెయిన్‌ ఇండ్స్‌ షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ అండ్‌ స్మాల్‌క్యాప్‌ ఒక శాతం వరకు డౌన్‌ అయ్యాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల బాటలో నడిచాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మరియు రియాల్టీ ఇండెక్స్‌ ఒక శాతం కన్నా ఎక్కువ చొప్పున లాసయ్యాయి.

నిఫ్టీ50లో దివిస్‌ ల్యాబ్స్‌, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ టాప్‌ లీడర్స్‌గా నిలిచాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిండాల్కో, కోల్‌ ఇండియా బాగా వెనకబడ్డాయి. వ్యక్తిగత స్టాక్స్‌ విషయానికొస్తే టీవీఎస్‌ ఎలక్ట్రానిక్స్‌ స్టాక్స్‌ విలువ ఏకంగా 18 శాతం పెరగటం విశేషం. తద్వారా 52 వారాల గరిష్ట విలువను నమోదు చేసింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 5 శాతం నేల చూపులు చూశాయి. క్యూ3 అప్‌డేట్స్‌ స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితి నెలకొనటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

10 గ్రాముల బంగారం రేటు 288 రూపాయలు పెరిగి గరిష్టంగా 55 వేల 818 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. కేజీ వెండి ధర 242 రూపాయలు లాభపడి అత్యధికంగా 70 వేల 159 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 26 పైసలు పడిపోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 80 పైసలుగా నమోదైంది.