Today (02-02-23) Stock Market Roudup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. నిన్నటిలాగే మిశ్రమ ఫలితాలు నెలకొన్నాయి. ఇవాళ గురువారం కూడా సెన్సెక్స్ లాభపడగా నిఫ్టీ నష్టపోయింది. వరుసగా నాలుగో రోజు సైతం రెండు కీలక సూచీలు బెంచ్ మార్క్ దాటకుండానే దిగువనే ముగిశాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విషయంలో పాజిటివ్ టాక్ వస్తున్నప్పటికీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లో పరిస్థితులు మెరుగుపడకపోవటం గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో ఈ రోజు మొత్తం సెన్సెక్స్ మరియు నిఫ్టీ లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి.
చివరికి.. సెన్సెక్స్.. 224 పాయింట్లు పెరిగి 59 వేల 932 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ.. అత్యంత స్వల్పంగా 5 పాయింట్లు తగ్గి 17 610 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ అండ్ స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు సున్నా పాయింట్ 9 శాతం వరకు లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ బాగా వెనకబడగా.. ఐటీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్ మంచి పనితీరు కనబరిచాయి.
STUMAGZ: మధ్యతరగతి విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టే ప్రపంచ స్థాయి వేదిక.. స్టుమాగ్
నిఫ్టీలో బ్రిటానియా, ఐటీసీ షేర్ల విలువ 5 శాతం పెరిగింది. సెక్టార్ల వారీగా చూస్తే.. నిఫ్టీలో ఎఫ్‌ఎంసీజీ రెండు శాతానికి పైగా రాణించింది. నిఫ్టీ ఐటీ సూచీ కూడా ఒక శాతానికి పైగా పెరిగింది. మెటల్ ఇండెక్స్ మాత్రం 2 శాతం పడిపోయింది. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే అదానీ గ్రూపులోని అదానీ పోర్ట్స్ షేర్ వ్యాల్యూ 5 శాతం వరకు తగ్గింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ విలువ పది శాతం పతనమైంది.
10 గ్రాముల బంగారం ధర రూ.748 పెరిగి గరిష్టంగా రూ.58,700 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు ఏకంగా రూ.1972 లాభపడి అత్యధికంగా రూ.71,813 పలికింది. క్రూడాయిల్ ధర అతితక్కువగా రూ.11 పెరిగింది. బ్యారెల్ ముడి చమురు రూ.6,292గా నమోదైంది. రూపాయి విలువ 29 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 82 రూపాయల 21 పైసల వద్ద స్థిరపడింది.
