Toby : ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ టాలెంటెడ్ యాక్టర్ రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘టోబీ’. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన థియేటర్లలో విడుదల అయి కన్నడలో మంచి విజయం సాధించింది. ఈ రూరల్ యాక్షన్ మూవీకి టాక్ మరియు రివ్యూలు కూడా పాజిటివ్‍గా వచ్చాయి. పాజిటివ్ టాక్ తో ఈ మూవీ కలెక్షన్లను కూడా బాగానే సాధించింది. దీంతో ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు టాబీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ సినిమా తెలుగు లో కూడా అందుబాటులోకి వచ్చింది.టోబీ సినిమా సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళం భాషలలో ఈ మూవీ సోనీ లివ్‍లో అందుబాటులోకి వచ్చింది. టోబీ చిత్రానికి బాసిల్ అచలక్కల్ దర్శకత్వం వహించారు.
టోబీ చిత్రంలో రాజ్ బీ శెట్టి యాక్టింగ్ సినిమాకే హైలైట్‍గా నిలిచింది. ఈ చిత్రంలో చరిత్ర జే ఆచార్, సంయుక్త హొరనడు, గోపాల్‍కృష్ణ దేశ్‍పాండే మరియు రాజ్ దీపక్ శెట్టి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా కథను కూడా హీరో రాజ్ బీ శెట్టినే అందించారు.. ఈ మూవీకి ముధున్ ముకుందన్ సంగీతం అందించారు. లైటర్ బుద్ధా ఫిల్మ్స్, అగస్త్య ఫిల్మ్స్, కాఫీ గ్యాంగ్ స్టూడియో మరియు స్మూత్ సైలర్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.అమాయకంగా ఉండే టోబీ (రాజ్ బీ శెట్టి)ని హత్యలు చేసేందుకు ఊరి పెద్దగా ఉండే ఆనంద (దీపక్ శెట్టి) ఉపయోగించుకుంటుంటారు. అయితే, తనను ఉపయోగించుకుంటూ మోసం చేసుకుంటున్నారని గ్రహించిన టోబీ తనను వాడుకుంటున్న వారిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ టోబీ మూవీ కథ.టోబీ చిత్రం ఫస్ట్ లుక్ నుంచే విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. టీజర్ మరియు ట్రైలర్ తో ఈ సినిమాకు భారీగా హైప్ పెరుగుతూ పోయింది. అందుకు తగ్గట్టే కన్నడలో టోబి మూవీ మంచి హిట్ అయింది.
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!