తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకి, బిజు జనతాదళ్ సీనియర్ నాయకుడు (బీజేడీ) పినాకి మిశ్రాతో వివాహం జరిగింది. మొయిత్రా, మిశ్రా 14 రోజుల క్రితం బెర్లిన్‌లో వివాహం చేసుకున్నారని ఓ టీఎంసీ సీనియర్ నాయకుడు జాతీయ మీడియాకు వెల్లడించారు. ఈ అంశంపై సదరు మీడియా సంస్థ ప్రతినిధి మొయిత్రా సంప్రదించినప్పుడు ఆమె స్పందించలేదు. అయితే.. ఈ వదంతుల మధ్య తాజాగా ఎంపీ మహువా మొయిత్రా అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. 65 ఏళ్ల పినాకి మిశ్రాతో 50 ఏళ్ల మహువా మొయిత్రా కలిసి కేక్ కట్ చేస్తున్న ఫొటోను పంచుకున్నారు. తమకు శుభాకాంక్షలు తెలిపిన వాళ్ల ధన్యవాదాలు చెప్పారు.
READ MORE: Deepika Padukone : దీపిక నాతో రెండేళ్లు డేటింగ్ చేసింది.. నటుడి షాకింగ్ కామెంట్స్..
మహువా మొయిత్రా 1974లో అసోంలో జన్మించారు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేశారు. 2010లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటి నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 2019లో మొదటి సారి ఎంపీగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
READ MORE: Gautam Gambhir: “రోడ్‌షోలు అవసరమా..?” బెంగుళూరు ఘటనపై టీమిండియా కోచ్ రియాక్షన్ ఇదే..!
మరోవైపు.. నూతన వరుడు పినాకి మిశ్రా 1959లో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 65 ఏళ్లు. ఒడిశాలోని పూరీ నియోజకవర్గం నుంచి పలుమార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఢిల్లీలోని ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి చరిత్రలో డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. మొదట కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పినాకి మిశ్రా, 1996లో పూరీ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత బీజేడీలో చేరి, అనేక పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
Thank you everyone for the love and good wishes!! So grateful pic.twitter.com/hbkPdE2X7z
— Mahua Moitra (@MahuaMoitra) June 5, 2025
