TMC MLA escapes ED: బూచోళ్లను చూసి చిన్నపిల్లలు పారిపోయినట్లు.. ఈడీని చూసి అవినీతి ప్రజాప్రతినిధులు దడుచుకుంటున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఓ ఎమ్మెల్యే వాళ్ల ఇంటికి దర్యాప్తు కోసం వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులను చూసి వెంటనే ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయటికి దూకి పారిపోడానికి ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా తన ఫోన్‌ను వెంటనే సమీపంలోని డ్రైనేజీలో విసిరేశాడు. వచ్చిన వాళ్లు సాధారణ వ్యక్తులా ఆయన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టడానికి.. వెంటపడి మరి పెట్టుకున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, దీని వెనుక ఉన్న కారణాలు ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Team India: ఛెతేశ్వర్ పుజారా తర్వాత ఎవరు?.. రిటైర్మెంట్ లిస్టులో ‘ఆ నలుగురు’!
ఎమ్మెల్యే అరెస్ట్…
పశ్చిమ బెంగాల్‌లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకాల్లో జరిగిన కుంభకోణంపై ED దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ముర్షిదాబాద్ జిల్లా బుర్వాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహాను సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తు కోసం వెళ్లిన ఈడీ అధికారులను చూసి ఎమ్మెల్యే వాళ్ల ఇంటి ఫస్ట ఫ్లోర్ నుంచి కిందకి దూకి పారిపోడానికి ప్రయత్నించారు. కానీ అధికారులు ఆయనను పట్టుకున్నారు, ఆయన తన ఫోన్‌ను అధికారులకు దొరకకుండా చేయడానికి సమీపంలోని డ్రైనేజీలోకి విసిరేశారు. కానీ ఈడీ అధికారులు వెంటనే దాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఇంట్లో, అతని సన్నిహితుల రహస్య ప్రదేశాలలో ఈడీ ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈక్రమంలో ఈడీ అధికారులు ఆయనను అరెస్ట చేసి విచారణకు తీసుకెళ్లారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకాల్లో జరిగిన కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. దర్యాప్తులో బిర్భూమ్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి డబ్బు లావాదేవీలు జరిపినట్లు సమాచారం ఉందని, ఆ సమాచారం ఆధారంగానే దాడులు చేస్తున్నట్లు తెలిపారు. బిర్భూమ్ జిల్లాకు చెందిన ఒకరు ఈ రోజు ఉదయం ED అధికారులతో కలిసి ఎమ్మెల్యే సాహా నివాసానికి వెళ్లారు. గతంలో ఈ కుంభకోణానికి సంబంధించి ఎమ్మెల్యే సాహా భార్యను కూడా ఈడీ ప్రశ్నించింది.
READ ALSO: allergy death: అలర్జీ ఎంత పని చేసిందంటే.. 22 ఏళ్ల అమ్మాయి 24 గంటల్లో మృతి
