Site icon NTV Telugu

Sandeshkhali Case: సందేశ్‌ఖాలీ కేసులో కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు

Hc

Hc

సందేశ్‌ఖాలీ కేసులో హైకోర్టు సీరియస్ అయింది. పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని సందేశ్‌ఖాలీ (Sandeshkhali) కేసులో రాష్ట్ర పోలీసులకు కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) నేత షాజహాన్‌ షేక్‌ (Sheikh Shajahan)ను అరెస్ట్ చేసి తీరాల్సిందేనని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది.

మహిళలపై గూండాలు లైంగిక వేధింపులు పాల్పడ్డారని, వారి భూములను ఆక్రమించారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) నేత షాజహాన్‌ షేక్‌ (Sheikh Shajahan)ను అరెస్టు చేయకూడదని తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని.. తక్షణమే అతడిని అరెస్ట్ చేసి తీరాల్సిందేనని పోలీసులకు సూచించింది.

సందేశ్‌ఖాలీ ఘటనపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సందేశ్‌ఖాలీ కేసులో పోలీసుల చేతులను కోర్టు కట్టేసిందన్నారు. అందుకే షాజహాన్‌ను అరెస్టు చేయలేకపోతున్నామని తెలిపారు.

సోమవారం ఈ కేసు కలకత్తా హైకోర్టులో విచారణకు రాగా అభిషేక్‌ బెనర్జీ వ్యాఖ్యలను అమికస్‌ క్యూరీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అరెస్టు నిలుపుదల చేశారా? లేదా అన్నదానిపై స్పష్టతనివ్వాలని కోరారు.
దీనికి కోర్టు స్పందిస్తూ.. మేం అరెస్టుపై ఎలాంటి స్టే విధించలేదని. ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని తెలిపింది. నిందితుడి షాజహాన్‌ను అరెస్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. సందేశ్‌ఖాలీ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.

ఈ నేపథ్యంలో షాజహాన్‌ షేక్‌, ఈడీ, సీబీఐ, రాష్ట్ర హోం సెక్రటరీని పార్టీలుగా ఇంప్లీడ్‌ చేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. దీనిపై వార్తాపత్రికల్లో పబ్లిక్‌ నోటీసు ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అతడిపై న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు ఆ నోటీసుల్లో పేర్కొనాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.

సందేశ్‌ఖాలీ ఘటనపై గత కొద్ది రోజులుగా పశ్చిమబెంగాల్ అట్టుడుకుతోంది. మహిళల ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలిపింది. ఈ ఆందోళనల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా గాయాలపాలయ్యారు. మరోవైపు వచ్చే నెల ఫస్ట్‌వీక్‌లో ప్రధాని మోడీ పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తు్న్నారు. ఈ పర్యటనలో సందేశ్‌ఖాలీ బాధితులను మోడీ పరామర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Exit mobile version