NTV Telugu Site icon

TMC manifesto: సీఏఏ, ఎన్‌ఆర్సీ రద్దుతో పాటు 10 వాగ్దానాలు.. ఏవేవంటే..!

Manifesto

Manifesto

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జోరు సాగుతోంది. ఏడు విడతల్లో పోలింగ్ జరగుతుండగా.. తొలి విడత శుక్రవారమే ప్రారంభంకానుంది. అయితే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పోలింగ్‌కి రెండు రోజుల ముందు మేనిఫెస్టోను ప్రకటించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, యూనిఫాం సివిల్ కోడ్ రద్దుతో పాటు 10 కీలక వాగ్దానాలతో కూడిన మేనిఫెస్టోను బుధవారం తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసింది. పశ్చిమబెంగాల్‌లో తొలి దశలో కూచ్‌బెర్, అలిపుర్‌దౌర్, జలపాయ్‌గురిలో పోలింగ్ జరగనుంది.

ఇది కూడా చదవండి: Govt Jobs 2024 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే?

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్‌సీ), ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) పశ్చిమబెంగాల్‌లో అమలు చేసేది లేదని మేనిఫెస్టోలో తృణమూల్ కాంగ్రెస్ స్పష్టంచేసింది. ఇండియా కూటమిలో భాగంగా కేంద్రంలో టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామని తెలిపింది. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని వెల్లడించింది. ఉద్యోగాలకు భరోసా, యూనివర్శల్ హౌసింగ్, ఉచిత ఎల్‌పీజీ సిలెండర్లు వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది.

ఇది కూడా చదవండి: Bellamkonda: షైన్ స్క్రీన్స్ తో బెల్లంబాబు కొత్త సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది!

2024 లోక్‌సభ ఎన్నికల కోసం మేనిఫెస్టో విడుదల చేయడం ఆనందంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఎక్స్ ట్విట్టర్ ట్వీట్ చేసింది. ప్రతి భారతీయునికి ఉపాధి హామీ, సార్వత్రిక గృహాలు, ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు, రైతులకు హామీ ఇవ్వబడిన MSP, SC, STలకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపింది. బీజేపీ జమీందార్లను పడగొట్టి అందరికీ గౌరవప్రదమైన జీవితానికి మార్గం సుగమం చేస్తామని టీఎంసీ వెల్లడించింది.

తృణమూల్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న 10 వాగ్దానాలివే..
రూ.400 రోజువారీ వేతనంతో జాబ్ కార్డ్ హోల్డర్‌లకు 100 రోజుల పని హామీ
బీపీఎల్ కుటుంబాలకు సంవత్సరానికి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితం
పేద కుటుంబాలకు ఉచిత ఇళ్లు
రేషన్ కార్డ్ హోల్డర్లందరికీ ఫ్రీ రేషన్ డెలివరీ
SC/STల ఉన్నత విద్య కోసం నెలకు రూ.1,000 స్కాలర్‌షిప్
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు
పెట్రో ఉత్పత్తుల ధరల స్థిరీకరణ నిధి
25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా హోల్డర్లకు అప్రెంటిస్‌షిప్
CAA, NRC రద్దు, దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ ఉండదు
దేశవ్యాప్తంగా బాలికలకు కన్యాశ్రీ వంటి సంక్షేమ పథకాలు