Site icon NTV Telugu

TMC vs BJP Fight: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..

Bjp Vs Tmc

Bjp Vs Tmc

TMC vs BJP Fight: లోక్‌సభ ఎన్నికలు 2వ దశ ఓటింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని బలూర్‌ఘాట్, రాయ్‌గంజ్‌లలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. మహిళలు ఓటు వేయకుండా కేంద్ర బలగాలు అడ్డుకుంటున్నాయని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ కి టీఎంసీ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో పరస్పరం దాడులకు దిగారు. దీంతో టీఎంసీ- బీజేపీ కార్యకర్తలు దాడులు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక, తృణమూల్ కాంగ్రెస్ నేతలు పోలింగ్ బూత్ ఎదుట బైఠాయించిన ఆందోళన కొనసాగించారు. ఇక, దాడిపై పోలీసులు అలర్ట్ కావడంతో పాటు ఇరు వర్గాలను చెదరగొట్టారు. మజుందార్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.

Read Also: Nayanthara: నయనతార ఈజ్ బ్యాక్.. హాట్నెస్ ఓవర్ లోడెడ్..

ఇక, లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో భాగంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఇక, ఇప్టపి వరకు త్రిపురలో అత్యధికంగా 17 శాతం నమోదు కాగా, మహారాష్ట్రలో అత్యల్పంగా 7.45 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రెండో దశలో లోక్‌సభ ఎన్నికల్లో స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఐదుగురు కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలు, ముగ్గురు సినీ తారలు బరిలో ఉండటంతో పాటు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, శశిథరూర్, హేమమాలిని పోటీ చేస్తున్నా పార్లమెంట్ స్థానాలకు కూడా ఓటింగ్ కొనసాగుతుంది.

Exit mobile version