Site icon NTV Telugu

Titanic Submarine: టైటానిక్‌ జలాంతర్గామి గాలింపులో పురోగతి..!

Titanic

Titanic

Titanic Submarine: టైటానిక్‌ నౌక శకలాల దగ్గరికి బయల్దేరి గల్లంతైన మినీ జలాంతర్గామి గాలింపులో చిన్న డెవలప్‌మెంట్ కనిపించింది. అంట్లాంటిక్‌ సముద్రంలో ఒక చోట నీటి అడుగున శబ్దాలు వస్తున్నట్టు కెనడా నిఘా విమానం గుర్తించింది. ఈ విషయాన్ని అమెరికా కోస్ట్‌గార్డ్‌లోని నార్త్‌ఈస్ట్‌ కమాండ్‌ కూడా తెలిపింది. కెనడా విమానం సముద్రంలో శబ్దాలను గుర్తించిందని అమెరికా పత్రికలు సైతం పేర్కొన్నాయి. ప్రతి అరగంటకోసారి సౌండ్స్ వస్తున్నట్లు కెనడా విమానం గుర్తించిందని వెల్లడించాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఈ శబ్దాలు గుర్తించినట్లు హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తెలిపింది.

Read Also: Hyderabad: వాహనదారులకు అలర్ట్.. రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!

దాదాపు మూడు రోజులుగా సాగుతున్న గాలింపు చర్యల్లో ఇదే తొలి పురోగతి. అమెరికా గాలింపు బృందాలు జరిపిన శోధనలో ఎలాంటి శబ్దాలు గుర్తించలేదు. పైగా ప్రతికూల ఫలితాలు వచ్చాయని నార్త్‌ ఈస్ట్‌ కమాండ్‌ వివరించింది. అయినా కానీ గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. మరోవైపు డీప్‌సీ మ్యాపింగ్‌ కంపెనీ ఎక్స్‌ప్లోరర్స్‌ క్లబ్‌ కూడా గాలింపు చర్యల్లో పాల్గొనేందుకు అనుమతులు లభించాయి. గల్లంతైన జలాంతర్గామిలో బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త, సాహసయాత్రికుడు హమీష్‌ హార్డింగ్‌, పాకిస్థాన్‌ బిలియనీర్‌ షాజాదా దావూద్‌, ఆయన కుమారుడు సులేమాన్‌, మరో ఇద్దరు ఉన్నారు. దీంట్లో మరో 30 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ మాత్రమే మిగిలి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version