NTV Telugu Site icon

Kolikapudi Srinivas: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కీలక పోస్ట్..

Kolikapudi

Kolikapudi

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు. పదవి శాశ్వతం కాదు, బాధితులకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాల్లోకి రావడం అనవసరం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైసీపీ నేత భవనం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని కూల్చటానికి ఎమ్మెల్యే కొలికపూడి నిన్న జేసీబీతో వెళ్లారు. ఈ ఘటనపై కొలికపూడి సహా టీడీపీ నేతలు, క్యాడర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చారు. అయితే..
తాజా ఘటనలతో ఎమ్మెల్యే మనస్తాపంతో పోస్ట్ పెట్టారని ప్రచారం జరుగుతోంది.

Indonesia: మహిళను మింగిన కొండచిలువ.. భర్త ఏం చేశాడంటే..!

వైసీపీ నేతగా, వైసీపీ ఎంపీపీ భర్త చెన్నారావు అనే రాక్షసుడు గత కొన్నేళ్లుగా స్థానికంగా అరాచకం చేస్తున్నాడని ఎమ్మెల్యే కొలికపూడి తెలిపారు. చంద్రబాబు, కేశినేని చిన్ని కార్లపై రాళ్ళ దాడికి దిగాడన్నారు. అంతేకాకుండా.. స్థలాలు లాక్కుని ప్రభుత్వ భూమి కలుపుకుని అక్రమంగా బిల్డింగ్ కడుతున్నాడని పేర్కొన్నారు. చర్యలు తీసుకోమన్న అధికారులు స్పందించలేదని.. తాను వెళ్తున్నా అంటే తప్ప ముందుకి రాలేదని చెప్పారు. రాళ్ళ దాడిపై తాను ఫిర్యాదు చేసినా పోలీసులు అరెస్ట్ చేయలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Pakistan Cricket: ఆర్మీ ట్రైనింగ్ తర్వాత పాక్ జట్టుకు సరికొత్త శిక్షణ.. వీడియోలు వైరల్..

కాగా.. నిన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కంభంపాడు ఘటనపై వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి, టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తన ఇల్లు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో.. ఎమ్మెల్యే కొలికపూడి, మరికొందరిపై ఏ.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు.