Site icon NTV Telugu

Tirupati: విషాదం.. నది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఏడుగురు యువకులు..!

Tirupathi

Tirupathi

Tirupati: తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం వద్ద ఉన్న స్వర్ణముఖి నదిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సీపీఆర్ విల్లాస్ వెనుక ఉన్న స్వర్ణముఖి నదిలో ఈతకు దిగిన ఏడుగురు యువకుల బృందం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఇసుక దిబ్బలపై ఆడుకుంటూ నీటిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Liquor Shop Licence: మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు.. ఎన్ని వచ్చాయంటే?

వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకులలో ప్రకాశ్ (17), చిన్న (15), తేజు (19), బాలు (16)గా పోలీసులు గుర్తించారు. ఈ ఏడుగురిలో విష్ణు, మణిరత్నం, కృష్ణ అనే ముగ్గురు యువకులు ప్రాణాలతో బయటపడగా, ఇద్దరు యువకులు మృతి చెందారు. మిగిలిన ఇద్దరు యువకుల కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. నదిలో ప్రస్తుతం వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Kurnool Bus Tragedy: బస్సును తొలగిస్తుండగా క్రేన్‌ బోల్తా.. ఆపరేటర్‌కు గాయాలు..!

Exit mobile version