NTV Telugu Site icon

Tirupati Ruia Hospital: రుయా సిబ్బంది తీరుపై విమర్శలు

Ruia 1

Ruia 1

ప్రభుత్వ దవాఖానాలంటే అవినీతికి రూపాలనే నానుడి వుంది. దానిని నిజం చేస్తున్నారు తిరుపతిలోని రుయా ఆస్పత్రి సిబ్బంది. ఈమధ్యే అంబులెన్స్ ల దందా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలకు కారణం అయింది. తాజాగా ఆస్పత్రికి వచ్చిన రోగుల్ని పీల్చిపిప్పిచేస్తున్నారు సిబ్బంది. వరుస ఘటనలు జరుగుతున్నా రుయా ఆసుపత్రి సిబ్బంది తీరు మారడం లేదు.

తాజాగా డబ్బులు ఇస్తేనే తప్ప వైద్య సిబ్బంది సేవలు అందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది రోగి బంధువు. ఆపరేషన్‌ కోసం రుయా వచ్చిన పుత్తూరుకు చెందిన నాగరత్నను డబ్బులు డిమాండ్ చేశారు రుయా సిబ్బంది. ఆపరేషన్ కి ముందు షేవింగ్ చేయడానికి వంద..బెడ్ మీదకు తీసుకురావడానికి నాలుగు వందలు డిమాండ్ చేశారు. డబ్బులు లేవని చెబితే ఎంతో కొంత ఇవ్వమని ఒత్తిడి చేశారు. దీంతో బాధితురాలు సిబ్బందికి గూగుల్ పే చేసి, ఆ స్క్రీన్ షాట్ అధికారులకు పంపించారు. బాధితురాలి ఫిర్యాదుతో విచారించి ఇద్దరు సిబ్బందిపై రుయా సూపరింటెండెంట్ భారతి వేటు వేశారు. ప్రభుత్వ ఆస్పత్రి అయినా సిబ్బంది మాత్రం డబ్బులు డిమాండ్ చేయడం, రోగుల్ని వేధించడం మానలేదని ఈ ఘటనతో రుజువైంది. ఇలాంటి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.

Mahesh Babu: నాకు బాగా దగ్గరున్నవాళ్ళు దూరమయ్యారు.. ఎమోషనల్ అయిన మహేష్..