Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..

  • వసతి గదులు కేటాయింపునకి టీటీడీ రిజిస్ట్రేషన్ పద్దతి..
  • ఉ. 6 గంటల నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్..
  • ఆధార్ కార్డు ఆధారంగా వసతి గదుల కేటాయింపు
Ttd

Ttd

శ్రీవారి భక్తులే వారి టార్గెట్…భక్తులు ఆదమరిస్తే చాలు… వారి వస్తువులు మాయం.. ఏమారితే ఇక అంతే సంగతులు..వారి నుంచి అధిక మొత్తాన్ని వసూలు చేస్తారు. ఇలా శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దోరకని దొంగల సంఖ్య ఎక్కువే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తూంటారు. స్వామివారి దర్శనం కోసం తిరుమలకు విచ్చేసిన భక్తులకు వసతి గదులు మొదలుకోని దర్శనం పూర్తి అయ్యే వరకు అన్నింటికీ వేచివుండాల్సిందే..ఇదే అదనుగా భక్తులను మోసం చేయడం సులువుగా మార్చేసుకున్నారు అక్రమార్కులు. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు అప్రమత్తంగా లేకపోతే..వారి వస్తువులు చోరీకి పాల్పడడమో…లేక వారిని మోసం చేసి వారి నగదు కాజేయడం కూడా పరిపాటిగా మారిపోతోంది. ఇలాంటి సంఘటనలు తిరుమలలో కొత్త కాకపోయినా..టీటీడీ ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేస్తున్నా.. దొంగలు కొత్త ఎత్తులు వేస్తూ.. సరికొత్తగా భక్తులను మోసం చేస్తున్నారు.

సామాన్య భక్తులకు సులుభతరంగా వసతి గదులు కేటాయించడానికి టీటీడీ రిజిస్ట్రేషన్ పద్దతిని ప్రారంభించింది. ఎలాంటి సిఫార్సు లేకుండా తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే..వారికి ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన వసతి గదులు కేటాయింపు చేస్తోంది. ఇందు కోసం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహిస్తుండగా..వసతి గదులు ఖాళీలు బట్టి రాత్రి 9 వరకు గదులు కేటాయింపు ప్రకియ కొనసాగుతుంది. ఈ విధానం కారణంగా భక్తులు గంటల తరబడి క్యూ లైనులో వేచి వుండే అవసరం వుండదు. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా కేవలం ఆధార్ కార్డు ఆధారంగా మాత్రమే వసతి గదులు కేటాయిస్తారు. దీనినే ఆయుధంగా మలుచుకున్నారు దోంగలు. నకీలి ఆధార్ కార్డులు సృష్టించి రోటేషన్ పద్ధతిలో వసతి గదులకు రిజిస్ట్రేషన్ చేసుకోని గదులు దొరకక.. సిఆర్వో కార్యాలయం వద్ద వేచి వుండే భక్తులకు అధిక మొత్తంలో వాటిని విక్రయించి డబ్బులు చేసుకుంటున్నారు. ఇలా శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న ఆరుగురి సమాచారాన్ని గుర్తించి పోలీసులకు తెలిపారు టీటీడీ అధికారులు. దీంనితో కావు కాసిన పోలిసులు ఆరుగురిని అరెస్టు చేశారు. విచారణలో పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

శ్రీవారి భక్తులకు వసతి కష్టాలు తీర్చడానికి అధునాతనమైన సౌకర్యాలతో వేంకటాద్రి నిలయాని నిర్మించింది.125 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వసతి సముదాయంలో 5 వేల మంది భక్తులు సేదతీరే సౌలభ్యంతో పాటు తలనీలాలు సమర్పించడానికి కళ్యాణకట్టలతో పాటు వస్తువులు భధ్రపర్చడానికి లాకర్లు ఏర్పాటు చేసింది. ఇన్ని చేసిన టీటీడీ భక్తుల భధ్రత గురించి మాత్రం మర్చిపోయింది. తిరుమలంతా సీసీ కెమరాలు ఏర్పాటు చేసిన టీటీడీ.. అతి పెద్ద వసతి సముదాయంలో ఏర్పాటు చేయడం మాత్రం మర్చిపోయింది. దీంనితో దొంగలకు మంచి పని దోరికింది. భక్తులు ఆదమరిస్తే చాలు వారి సెల్ ఫోన్లు..నగదు మాయం చేస్తున్నారు. వేల మంది సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో..దొంగలను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఇప్పటికే సెల్ ఫోన్లు మాయమవడం..వేల రూపాయలు నగదు చోరీకి గురైనట్లుగా పోలీసులకు అనేక ఫిర్యాదులు అందినా.. ఈ ఘటనలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు.

యాత్రికుల వసతి సముదాయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని టీటీడీ దృష్టికి తీసుకువెల్లినా..స్పందన మాత్రం లేదు. ఇలాంటి సమయంలో వసతి గదులు అక్రమంగా పొందుతున్న భక్తులే వసతి సముదాయంలో సేదతీరుతూ..సమయం వచ్చినప్పుడు భక్తులు చార్జింగ్ కోసం పెట్టిన సెల్ ఫోన్లు కాజేయడం.. వారి బ్యాగులు కొట్టేయడం చేస్తున్నారని గుర్తించారు. మొత్తానికి శ్రీవారి భక్తులు కోసం నిర్మించిన యాత్రికుల వసతి సముదాయమే… దొంగలకు స్వర్గధామంగా మారిపోయింది. ఇప్పటికైనా ఇటు టీటీడీ విజిలెన్స్.. అటు పోలీసులు అప్రమత్తం కాకపోతే శ్రీవారి భక్తులు మరింతగా మోసపోవలసి వస్తుంది.