Site icon NTV Telugu

Tirumala Donation: వెంకన్న స్వామికి విరాళంగా రూ. 31.31 లక్షల లారీ అందజేత..

Tirumala

Tirumala

కలియుగ స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి భక్తులు వారి కోరికల మేరకు ప్రతిరోజు ఎన్నో రకాల కానుకలను స్వామివారికి సమర్పిస్తుంటారు. ఇకపోతే., తిరుమల వెంకన్న స్వామికి శనివారం ఒక లారీ విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్‌ లేలాండ్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ కుమార్ రూ.31.31 లక్షల విలువైన లారీని అందజేశారు టీటీడీ అధికారులకు అందచేసారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనానికి పూజలు నిర్వహించి, తాళాలను ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రవాణా విభాగం జిఎం శేషా రెడ్డి, తిరుమల డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.

Also read: Bank Robbery: పట్టపగలే ఎస్‌బీఐ బ్యాంకులో దోపిడీ.. రూ.20 లక్షలు స్వాహా..

ఇకపోతే ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త ఎక్కవగానే ఉంది. తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 30 కంపార్టుమెంట్స్ లో వేచియున్నారు. శుక్రవారం నాడు స్వామివారిని 62,624 మంది భక్తులు దర్శించుకోగా., 32,638 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.96 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలియచేసారు.

Exit mobile version