CM Chandrababu: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 2 వరకు కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరుఫున సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి ఎవరికి దక్కని భాగ్యాన్ని తనకు కల్పించారని సీఎం చంద్రబాబు అన్నారు. 14 సార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం కల్పించారని తెలిపారు. 22 సంవత్సరాల క్రితం వేంకటేశ్వర స్వామి ప్రాణబిక్ష పెట్టారని.. వేంకటేశ్వర స్వామి వారి ప్రాభల్యాని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లారన్నారు.
READ MORE: IND vs BAN: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. బంగ్లాదేశ్ టార్గెట్ ఏంటంటే?
ప్రపంచంలో హిందువులుండే ప్రతిచోట వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. “టీటీడీ అన్నప్రసాద పథకానికి రూ. 2283 కోట్లు విరాళాలు అందాయి. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాలో తిరుమల తరహాలో అన్నప్రసాద వితరణ ప్రారంభించాలి. దేశవ్యాప్తంగా అన్ని రాజధానులో శ్రీవారి ఆలయాలు నిర్మించాలి. ప్రపంచ వ్యాప్తంగా హిందువుల వున్న అన్ని ప్రాంతాలో స్వామివారి ఆలయాలు నిర్మించాలి. గ్రామీణ ప్రాంతాలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5 వేల ఆలయాలు నిర్మిస్తాం. ప్రాణదాన పథకానికి 709 కోట్లు విరాళాలు అందాయి. శ్రీవారి సేవ ద్వారా 17 లక్షల మంది సేవలందిస్తున్నారు. తిరుమలలో 80 శాతం పచ్చదనం ఉంది. దానిని మరింత పెంచాలి. బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యత అందరిది.” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
