Site icon NTV Telugu

Payyavula Keshav: కుట్రలు, కుతంత్రాలు దేశాన్ని ఏమీ చేయలేవు!

Payyavula Keshav

Payyavula Keshav

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ అనంతపురంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా.. జాతీయ జెండా చేత పట్టుకుని నగర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్.. ఎమ్మెల్యేలు దగ్గుపాటి, పల్లె సింధూర, బండారు శ్రావణి ఇతర ప్రజా ప్రతినిధులు సహ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ ,మాజీ సైనికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ నుండి సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ తిరంగా యాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ… ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ప్రపంచానికి మన త్రివిధ దళాల సత్తా చాటామన్నారు. ఉగ్రవాదం పేరుతో దేశాభివృద్ధిని అడ్డుకునే కుట్రలు, కుతంత్రాలు దేశాన్ని ఏమీ చేయలేవన్నారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశ సైన్యం శక్తి ఏంటన్నది యావత్ దేశానికి తెలిసిందన్నారు. పెహల్గాంలో అమాయక పర్యాటకుల ప్రాణాలు తీస్తే.. మన సైనికులు కేవలం ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడులు చేశారన్నారు.

Also Read: Crime News: కార్లు రెంటుకు తీసుకొని 50 లక్షల టోకరా!

గుంటూరులో ఆపరేషన్ సింధూర్ సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ర్యాలీకి భారీగా హాజరైన ప్రజలు.. జాతీయ జెండాలతో నగరవీధులలో ర్యాలీ నిర్వహించారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అత్యంత దుర్మార్గం అని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదులను‌ అంతం చేశామనన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న సైన్యానికి హట్సాఫ్ అని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ త్యాగాన్ని దేశ ప్రజలు మర్చిపోరన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి దేశ రక్షణే మొదటి ప్రాధాన్యం అని పెమ్మసాని చెప్పుకొచ్చారు.

Exit mobile version