NTV Telugu Site icon

Tiragabadara Saami Teaser: బాలయ్య సినిమా టికెట్స్ కోసం మర్డర్ చేసినా తప్పులేదు గిరి!

Tiragabadara Saami Teaser

Tiragabadara Saami Teaser

Raj Tharun’s Tiragabadara Saami Movie Teaser Released: రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా, మన్నార్‌ చోప్రా నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరా సామీ’. ఎఎస్‌ రవికుమార్‌ చౌదరి తెరకెక్కించిన ఏ సినిమాను సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్‌ నిర్మించారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరగబడరా సామీ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ ఇటీవల రిలీజ్ కాగా.. తాజాగా టీజర్ విడుదల అయింది.

1 నిమిషం 47 సెకండ్ల నిడివి గల ఈ సినిమా టీజర్.. ‘ఈ పనినే ప్రొఫెషన్‌గా ఎందుకు చూజ్ చేసుకున్నారో తెలుసుకోవచ్చా’ అనే డైలాగ్‌తో ఆరంభం అవుతుంది. ‘బాలయ్య సినిమా టికెట్స్ కోసం మర్డర్ చేసినా తప్పులేదు గిరి’, ‘ఇది నా సామ్రాజ్యం. అందరూ దీన్ని గంజాయివనం అంటున్నారని ఓ తులసి మొక్కను నాటా’, ‘ప్రాణమంటే భయపడే పిరికోడితో నీకు కాపురం ఎందుకు చెప్పు.. నువ్ ఎల్లిపో’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

Also Read: TTD Tigers: ఆపరేషన్‌ ‘చిరుత’ సక్సెస్‌.. ఇక కాలినడక భక్తులు ప్రశాతంగా వెళ్లొచ్చు!

ఆద్యంతం నవ్వుల ప్రయాణంలా సాగిపోయే కథ ఇదని, రాజ్‌ తరుణ్‌ పాత్ర ఎంటర్‌టైన్‌ చేస్తుందని దర్శక నిర్మాతలు ఇదివరకే చెప్పారు. భయపడే ఓ యువకుడు తన సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశంతో ఈ సినిమా కథ సాగుతుందని టీజర్‌లో అర్ధమైంది. ఈ సినిమాకి సంగీతం జెబి కాగా.. ఛాయాగ్రహణం ఎంఎన్‌ జవహర్‌ రెడ్డి. తిరగబడరా సామీ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ చెపుతామని టీజర్‌లో పేర్కొన్నారు.