NTV Telugu Site icon

Tips For Sinusitis : సైనస్ ని తగ్గించే ఇంటి చిట్కాలు

Sinus

Sinus

ప్రతి మనిషి తన జీవితకాలంలో సైనసైటిస్ బారిన పడనివారు ఉండరు. అలా కాకపోయినా కనీసం 90శాతం మంది సైనస్‌ బారిన పడతారని నిపుణులు అంటున్నారు. ఈ సైనసైటిస్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వస్తుంది. వైరస్, బాక్టీరియా, ముఖ్యంగా స్టైప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అయితే.. సైనస్‌ వలన చాలా రకాల సమస్యలు కలుగుతాయి. వాతావరణ మార్పులు లేదా కాలుష్యానికి బహిర్గతం అవ్వటం వలన ఈ సమస్యలు రెట్టింపు అవుతాయి. ఈ సైనస్‌ సమస్య నుండి ఉపశమనం పొందటానికి యాంటీబయోటిక్స్‌ వాడాలి. వీటికన్నా కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషదాలను వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
Also Read : Shirdi Sai Temple: షిర్డీ సాయి భక్తులకు గొప్ప శుభవార్త.. ఇకపై బాబా సమాధిని నేరుగా తాకే అవకాశం

అలెర్జీ కారకాలు సాధారణంగా సైనస్‌ స్థాయిలను పెంచుతాయి. కావున మీ గదిని కావలసిన స్థాయిలో శుభ్రంగా ఉంచుకోండి. గదిలో బెడ్‌ పైన మరియు దిండల పైన దుమ్ము ధూళి ఉండకుండా జాగ్రత్త పడండి. వీటితో పాటుగా ఎప్పటికప్పుడు గదిని శుభ్ర పరచుకొండి. మిరియాలు, కరివేపాకు, ఆవాలు, ముల్లంగి వంటి కారపు ఆహారాలు సైనస్ సమస్యల నుండి త్వరగా ఉపశమనాన్ని అందిస్తాయి.

Also Read : Tech Tips : మొబైల్ రేడియేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
అంతేకాకుండా సరైన మోతాదులో మాత్రమే ఆరోగ్యానికి మంచిది అని చెప్పవచ్చు. వేడి నీటి నుండి వచ్చే ఆ వీరులు తేమను సమకూర్చి సైనస్‌ నుండి త్వరిత ఉపశమనాన్ని అందిస్తాయి. వేడి నీటికి యూకలిప్టస్‌ లేదా మెంతాల్‌ నూనెలను కలిపి నీటి నుండి వచ్చే ఆ వీరులను పీల్చండి. ఈ నూనెలను కలిపిన వేడినీటితో స్నానం చేయడం వలన కూడా సైనా స్థాయిలో తగ్గుతాయి. యోగ కూడా సైనస్ వ్యాధి తీవ్రత లను తగ్గిస్తుంది. దీనిలో మొదటగా కాళ్లపై నిటారుగా నిలబడండి.

గాలిని పిలుస్తూ చేతులను పైకి లేపండి. గాలిని వదులుతూ నడుమును వంచి కింద కాలి యొక్క బొటన వేళ్ళను చేతులతో తాగండి. ఈ ఆసనం వలన సైనా స్థాయిలో తగ్గే అవకాశం ఉంది. ద్రాక్ష పండు విత్తనాలను ఎండబెట్టి పొడిగా చేసుకోంది. ఇది సహజ యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పొడిని ముక్కు ద్వారా పీల్చడం వలన ముక్కు లోని శ్లేష్మ స్థాయిలు తగ్గుతాయి. వీటితో పాటుగా సూక్ష్మ జీవులు మరియు వాటి సంబంధిత కారకాలు కూడా తొలగించబడుతాయి. ఈ చిన్న చిట్కాలు పాటించి సైనస్‌ నుండి విముక్తి పొందండి.