NTV Telugu Site icon

Healthy Liver : మీ కాలేయం హెల్తీగా ఉందా.. లివర్‌ను ఈ చిట్కాలతో రిఫ్రెష్‌ చేయండి..

Healthy Liver Tips

Healthy Liver Tips

అతిగా ఆహారం తినడం, జంక్‌ ఫుడ్‌ వేపుళ్ళు తీసుకోవడం, ఒత్తిడి, ఆందోళన, కాలుష్యం, పని భారం, పొగ తాగడం, మద్యం సేవించడం వంటివి అనేకరకాల కారణాల వల్ల అనేక మంది లివర్‌ డెంజర్‌ బెల్‌ మోగిస్తోంది. శరీరంలోని విశ్వ వ్యర్థాలను బయటకు పంపాల్సిన కీలకమైన పార్ట్‌ పనిచేయని మొరాయించిందంటే.. శరీర ధర్మాలు అన్నీ అస్తవ్యస్థం అయిపోతాయి. ఇది అలాగే దీర్ఘకాలం కొనసాగితే ప్రాణాంతకంగానూ మారుతుంది. కానీ ముందు జాగ్రత్తగా ఆహారం తీసుకునే విషయంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే లివర్‌ నాలుగు కాలాలపాటు భద్రంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే కొన్ని పదార్థాలకు లివర్‌ ఎప్పటికప్పుడు క్లీన్‌ చేసే గొప్ప లక్షణం ఉంది. దీంతో శరీరంలో ఎలాంటివి వ్యర్థాలు పేరుకుపోవు. మరి పదార్థాలు ఏమిటో తెలుసుకుని జాగ్రత్తగా ఉంటే హెల్తీగా ఉండొచ్చు కదా అవేంటో తెలుసుకుందాం. వెల్లుల్లి.. రోజు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు పచ్చిగా తినడం అలవాటు చేసుకుంటే దాంతో లివర్‌ సురక్షితంగా ఉంటుంది.

లివర్‌ ఎప్పటికప్పుడు శుభ్రమవుతుంది. వ్యర్థాలు బయటకి వెళ్ళిపోతాయి. ఈ అలవాటు మీకు ఎంతకాలం కొనసాగించ గలిగితే అంతకాలం మీ లివర్‌తో పాటు హార్ట్‌ కూడా ఏ డోకా ఉండదు. విటమిన్‌ సి, ఫ్రూట్స్‌, నిమ్మ, నారింజ, ద్రాక్ష, కివి లాంటి విటమిన్‌ సి ఉన్న పండ్లు తినాలి. వీటిల్లో ఉండే విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్‌లు లివర్‌ను క్లీన్‌ చేస్తాయి. తరచూ పండ్లను తింటుంటే లివర్‌ సమస్యలు రావు. రోజు ఒక గ్లాస్‌ వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగిన చాలు.. లివర్‌ క్లీన్‌ అవుతుంది. బీట్‌ రూట్‌, క్యారెట్‌లలో ఫ్లావనైడ్లు, బీటా కెరాటీన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి లివర్‌ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ.. లివర్‌ శుభ్రం చేస్తాయి. గ్రీన్‌ టీ.. క్యాటికిన్స్‌ అని పిలవబడే యాంటీ యాక్సిడెంట్‌లు గ్రీన్‌ టీలో పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌ శుభ్రం చేసి లివర్‌ పనితనాన్ని మెరుగుపరుస్తాయి. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి.

 

వీటిలో ఉండే గుణాలు లివర్‌లో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపి లివర్‌ను శుభ్రం చేస్తాయి. తద్వారా లివర్‌ పనితనం మెరుగుపడుతుంది. ఆవోకాడ శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు పంపేందుకు లివర్‌కు బ్లాటాతీయోన్‌ అనే అనబడే సమ్మేళనం అవసరమవుతుంది. అయితే సమ్మేళనం ఎక్కువ మోతాదులో కావాలంటే ఆవోకాడలను అప్పుడప్పుడైనా తినాలి. ఆలీవ్‌ ఆయిల్‌ని తీసుకోవడం వల్ల శరీరంలో ప్రత్యేకమైన లిపిడ్‌ సమ్మేళనాలను తయారు చేసుకుంటుంది. అవి వ్యర్ధాలను గ్రహించి బయటికి పంపిస్తాయి. దీంతో లివర్‌పై భారం తగ్గుతుంది. తద్వారా లివర్‌ క్లీన్‌ అవుతుంది. రాగులు, సజ్జలు, జొన్నలు వంటి ఆహారపదార్థాలను తరచు తినాలి. దీంతో లివర్‌ మెరుగ్గా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు శరీరంలో పేరుకుపోయే వ్యర్ధాలను తొలగిస్తుంది. పసుపు లివర్‌ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. నిత్యం ఒక గ్లాస్‌ వేడి పాలలో సగం టీ స్పూన్‌ పసుపు కలుపుకొని తాగినా చాలు లివర్‌ శుభ్రమవుతుంది.