NTV Telugu Site icon

THEATRE : రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లలో వారికి నో ఎంట్రీ..

Untitled Design (31)

Untitled Design (31)

రాష్ట్ర వ్యాప్తంగా 16 ఏళ్ల లోపు పిల్లలు రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లు లేదా మల్టీప్లెక్స్‌లలో సినిమాలు చూడకూడదని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చైల్డ్ సైకాలజిస్ట్‌లను సంప్రదించిన తరువాతనే.. 16 ఏళ్లలోపు పిల్లలను థియేటర్లు, మల్టీప్లెక్స్‌ లలోకి ఉదయం 11 గంటలలోపు, అలాగే రాత్రి 11 గంటల తర్వాత ప్రవేశ నియంత్రణ పై రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని పార్టీలకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు సిఫార్సు చేసింది. దీంతో సినిమా టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షోలకు అనుమతి పై దాఖలైన పిటిషన్ పై జనవరి 27 సోమవారం విచారణ చేసి.. జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

Also Read:Samantha: సినిమాలు తగ్గించడానికి కారణం ఇదే.. మొత్తానికి బయట పడిన సమంత

అయితే సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఉదయం 8.40లోపు, అర్ధరాత్రి 1.30 గంటల తరువాత సినిమాలకు అనుమతించరాదన్నారు. ముఖ్యంగా మైనర్లను ఎంట్రీ ఇవ్వకూడని తెలిపారు. ఎందుకంటే 16 ఏళ్ల లోపు పిల్లలు ఈ రాత్రి షో.. మార్నింగ్ షో చూడటం వల్ల శారీరక, మానసిక వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని.. మల్టీప్లెక్స్‌ల్లో చివరి షో అర్ధరాత్రి 1.30 గంటల దాకా నడుస్తుందని, ఇందులో మైనర్ల ప్రవేశానికి ఎలాంటి నియంత్రణలు లేవని కోర్టుకు తెలిపారు. పుష్ప-2 ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి, బాలుడు తీవ్రంగా గాయపడ్డారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సూచించారు. కాగా దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 22న జరగనుంది.