స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ “టిల్లు స్క్వేర్”. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లు మూవీకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ ఈ మూవీని డైరెక్ట్ చేసాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 29న థియేటర్స్ లో విడుదలై సందడి చేస్తోంది. టిల్లు స్క్వేర్ మూవీ విడుదల అయిన మొదటి రోజు నుంచి మంచి వసూళ్ల తో దూసుకెళ్తుంది.ఈ మూవీ ఫస్ట్ వీకెండ్‌లో రూ.68.1 కోట్లు వసూళ్లు రాబట్టి అదరగొట్టింది .అలాగే రూ.100 కోట్ల క్లబ్‌ను దాటి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.ఇలా టిల్లు స్క్వేర్ మూవీ తన సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తూ ఏకంగా 125 కోట్లు భారీ వసూళ్లు రాబట్టింది.
తాజాగా టిల్లు స్క్వేర్ కి వచ్చిన వసూళ్లతో టిల్లు టీం హ్యాపీ మూడ్ లో వుంది .ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ సంయుక్తం గా నిర్మించాయి.అలాగే ఈ మూవీకి రామ్ మిర్యాల అందించిన మ్యూజిక్ సినిమాకు చాల ప్లస్ అయింది .సిద్దు జొన్నలగడ్డ సినిమా మొత్తం తన డైలాగ్ డెలివరీ తో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు .సినిమా క్లైమాక్ లో ఇచ్చిన ట్విస్ట్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి .అలాగే అనుపమ గ్లామర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది .టిల్లు స్క్వేర్ తో మరోసారి సూపర్ ఎంటెర్టైమెంట్ అందించిన సిద్దు..టిల్లు ౩ మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు .టిల్లు పార్ట్ ౩ లో మరిన్ని ట్విస్టులు ,మరింత ఎంటర్టైన్మెంట్ ఉండనున్నట్లు సమాచారం.
