Site icon NTV Telugu

Tillu Square Collections : బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తున్న ‘టిల్లు – లిల్లి’..!

15

15

ఎన్నో అంచనాల నడుమ మార్చి 29న ప్రేక్షకులకు ముందుకి థియేటర్ల లోకి వచ్చిన టిల్లు స్క్వేర్ అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద వసూల్లోని రాబడుతోంది. సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోస్ ద్వారా పెద్ద ఎత్తున కలెక్షన్లు వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మొదటి రోజు కలెక్షన్లు చూస్తే సినిమా వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారుతుంది. ఇక మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 23.7 కోట్లు గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టింది. ఇక తెలుగు రాష్ట్రాలలో రూ. 11.5 కోట్లు కలెక్ట్ చేయగా., కర్ణాటకలో రూ. 1 కోటిగా పైగా, మిగతా భారత దేశంలో 20 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.

Also read: Vijay Picture Fan Blood: ‘అరేయ్ మెంట్’.. అభిమానికి విజయ్ దేవరకొండ స్వీట్ వార్నింగ్..!

ఇంకా అదే విధంగా ఓవర్సీస్ లో మొదటి రోజు 10 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇందులో ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఏకంగా ఒక మిలియన్ డాలర్స్ ను కొల్లగొట్టిందంటే ఈ సినిమా స్టామినా ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఒక మీడియం రేంజ్ హీరో సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఇక చూసుకుంటే మీడియం రేంజ్ హీరోలా స్థాయిలో ప్రస్తుతం జొన్నలగడ్డ సిద్దు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హీరోగా ముందుంటాడు. నైజాం ఏరియాలో ఈ సినిమాకి రూ. 4.35 కోట్లను కొల్లగొట్టింది. దీన్నిబట్టి చూస్తే ఇటీవల కాలంలో విడుదలైన హనుమాన్ సినిమా మించి మంచి కలెక్షన్స్ రాబట్టింది.

Also read: Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు..

అనుపమ పరమేశ్వరన్, సిద్దు మొదటిసారి జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. 2022లో విడుదలైన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. మల్లిక్ రాం ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

Exit mobile version