మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం కాబోతోంది టిల్లు స్క్వేర్. సోషల్ మీడియాలో పాన్ ఇండియా వేదికగా ఈ సినిమాకి మంచి బజ్ నడుస్తోంది ప్రస్తుతం. డీజే టిల్లు సినిమా సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రూపొందుతోంది. ఇకపోతే తాజాగా సినిమాకు సంబంధించి జరిగిన చర్చల్లో సీక్వెల్ సినిమాకి డైరెక్టర్ ఎందుకు మారాడని ప్రశ్న ఎదురైంది. దీంతో ఎట్టకేలకు హీరో సిద్దు సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: Kurnool TDP: టీడీపీకి తలనొప్పిగా కర్నూలు.. ఐదు నియోజకవర్గాల్లో అదే తీరు..!
మొదటి నుండి ఈ సినిమా సంబంధించి డైరెక్టర్ విషయంలో అనేక ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. మొదటి సినిమా డీజే టిల్లు కు విమల కృష్ణ దర్శకత్వం వహించగా అయితే టిల్లు స్క్వేర్ కి మాత్రం మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా మొదట టిల్లు తీసిన విమల్ కృష్ణకు సినిమా తీయడం ఇష్టం లేక తప్పుకున్నాడంటూ చెప్పుకొచ్చారు. కాకపోతే విమల్ కృష్ణ స్థానంలో మళ్లీ మల్లిక్ రామ్ రావడం పట్ల అసలైన సమాధానం సిద్దు తాజాగా తెలిపారు. అసలు ఇలా జరగడానికి పెద్ద కారణమేమీ లేదని.. టిల్లు సీక్వెల్ తీయాలనుకున్నప్పుడు విమల కృష్ణ అందుబాటులో లేడు. ఆ సమయంలో అతను వేరే సినిమాకి కమిట్ అయ్యాడు. అందుకే అతను టిల్లు స్క్వేర్ తీయలేదు అని చెప్పుకొచ్చాడు. వీటితోపాటు ఫస్ట్ సినిమా చేసిన వాళ్ళు రెండో పార్ట్ చేయాలని ఎక్కడ లేదని కూడా తెలిపాడు. అలాగే ఉదాహరణకు స్పైడర్ మాన్ సినిమాలు హీరోలు మారుతున్నప్పటికీ ఆడియన్స్ మాత్రం సినిమాలను ఆదరిస్తూ అందరిని సమానంగా రిసీవ్ చేసుకున్నట్లు తెలిపాడు.
Also read: Sonu Gouda: బిగ్ బాస్ భామకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..!
దీంతోపాటు మా ప్రాజెక్టులో ‘నన్ను మార్చలేదు., కాకపోతే డైరెక్టర్ మారారు అంతే’ అంటూ సిద్దు జొన్నలగడ్డ అసలు విషయాన్ని తెలిపారు. ఇక డీజే టిల్లు స్క్వేర్ సినిమా పరంగా చూస్తే కాస్త రొమాన్స్ ఎక్కువగానే ఉన్నట్లు కనబడుతోంది. కాకపోతే తాజాగా సెన్సార్ సర్టిఫికెట్ చూసినా ప్రేక్షకులు ఆలోచనలో పడిపోయారు. టిల్లు స్క్వేర్ సినిమా గాను యూఏ సర్టిఫికెట్ రావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రేక్షకులకు నిరాశ మిగిలేటట్లు ఉంది. ఇక స్టోరీ పరంగా చూస్తే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అభిమానులు తెలుపుతున్నారు.