Peddi: ‘పెద్ది’ సెట్స్‌లో వరల్డ్ కప్ హీరో.. రామ్ చరణ్ స్పోర్ట్స్ యాక్షన్‌కు యువ క్రికెటర్ ఫిదా!

Tilak Varma At Peddi Sets

Tilak Varma At Peddi Sets

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ చిత్ర సెట్స్‌లో ఒక స్పెషల్ విజిట్ అందరినీ ఆకర్షించింది. ఇటీవల ముగిసిన T20 వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక సభ్యుడు, తెలుగు తేజం తిలక్ వర్మ ‘పెద్ది’ సెట్స్‌లో సప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు సాన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో.. తిలక్ వర్మ షూటింగ్ స్పాట్‌కు చేరుకుని రామ్ చరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. తర్వాత సెట్‌లో చిత్రీకరిస్తున్న ఇంటెన్స్ స్పోర్ట్స్ సీక్వెన్స్‌లను తిలక్ ఎంతో ఆసక్తిగా గమనించారు. అనంతరం చిత్ర బృందం తిలక్ వర్మకు ఒక స్పెషల్ బ్యాట్‌ను గిఫ్ట్‌గా అందజేసింది.

READ ALSO: Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ ‘రివెంజ్’ షురూ.. సినిమాలో యామీ గౌతమ్ సర్ప్రైజ్ రోల్ ఇదే!

ఏప్రిల్ 30న థియేటర్స్‌లో ‘పెద్ది’ గర్జన..
రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నట్లు గతంలోనే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

READ ALSO: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌తో సినిమా మా ఐదేళ్ల కల.. ‘ఉస్తాద్’ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్: నవీన్ యెర్నేని