Site icon NTV Telugu

Tilak Varma: రెండో టీ20లోనూ మనోడే మెరిశాడు.. అర్థసెంచరీ సాధించిన తిలక్

Tilak

Tilak

వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో తెలుగుతేజం తిలక్ వర్మ మళ్లీ మెరిశాడు. తొలి టీ20లోనే అత్యుత్తమ ప్రదర్శన చూపించిన తిలక్.. 39 పరుగులు చేశాడు. ఇక ఈరోజు జరిగిన రెండో టీ20లోనూ అర్థసెంచరీ సాధించాడు. 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అందులో 5 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.

Pawan Kalyan: గద్దర్‌ పార్థివదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టిన పవన్ కళ్యాణ్

ఓపెనర్లుగా క్రీజులోకి దిగిన ఇషాన్ కిషన్ 27 పరుగులు చేయగా, శుభ్ మాన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (1) చెత్త బ్యాటింగ్ చేసి నిరాశపరిచారు. ఈ సమయంలో జట్టుకు భారీగా పరుగులు కావల్సి ఉండటంతో.. తిలక్ వర్మ అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన చూపించాడు. మరోవైపు ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సంజు శాంసన్ 7 పరుగులకే అవుట్ కాగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 24, అక్షర్ పటేల్ 14 పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో అకీల్ హోసీన్ 2, అల్జారీ జోసెఫ్ 2, రొమారియో షెపర్డ్ 2 వికెట్లు తీశారు.

Exit mobile version